వర్క్ ఫ్రం హోం బెటర్..: ఆఫీసులకు రాంరాం..: ఐటీ ఉద్యోగుల స్పందన

Update: 2022-06-07 07:34 GMT
కరోనా వైరస్  మొదటి ఎఫెక్ట్ ఐటీ ఉద్యోగులపై పడింది. మిగతా రంగాల్లోని వారి కంటే ముందుగా ఈ రంగానికి చెందిన ఉద్యోగులకు లాక్డౌన్ ప్రకటించారు. ఆ తరువాత వర్క్ ఫ్రం  హోం విధించారు. ఇంటి నుంచి ఆఫీసు కార్యాకలాపాలు సాగించాలని సూచించారు. అయితే కరోనా తీవ్రత ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్రత ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ క్రమంలో కొన్ని ఐటీ సంస్థలు కార్యాలయాల్లో పనిచేయాలని తమ ఉద్యోగులకు ఆదేశాలు పంపిస్తున్నాయి. మొదట్లో 50 శాతం మాత్రమే అనుమతించిన యాజమాన్యం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆఫీసుకు రావాలని అంటున్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడడం లేదు. తమకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తేనే కార్యాలయాలకు వస్తామని అంటున్నారు. ఈ విషయంపై సీఐఈఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

హైదరాబాద్ లో ఐటీ రంగంలో 6 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నార్మల్ స్టేజిలో ఉండడంతో గత మార్చి నుంచి యాజమాన్యం కార్యాలయాకు రావాలని ఉద్యోగులకు మెసేజ్లు పంపుతోంది. తొలుత వారంలో మూడు రోజులు ఆఫీసుల్లో పనిచేస్తే చాలని చెప్పారు. అయితే ఆ తరువాత పూర్తికాలం ఆఫీసుల్లో పనిచేయాలని తెలపడంతో ఉద్యోగులు సుముఖత చూపడం లేదు. కార్యాలయాల్లో తమకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తేనే  పనిచేస్తామని డిమాండ్ చేస్తున్నారు. పనిచేసే చోట సరైన సౌకర్యాలు లేకపోతే కష్టమని అంటున్నారు. ఫర్నీఛర్, ఓపెన్ ఆఫీసు విధానం, ఆలోచనలు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అంటున్నారు.

వర్క్ ఫ్రం హోం ద్వారా కొంత మంది ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆర్థిక నష్టంతో పాటు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ఉద్యోగుల భార్యలు తమ భర్తలకు సేవలు చేయలేక వర్క్ ఫ్రం హోం విధానాన్ని క్యాన్సిల్ చేయాలని సంస్థలకు లేఖలు రాశారు. మరోవైపు కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా ఫైనాన్షియల్ గా నష్టపోతున్నామని ఆవేదన చెందారు.  కరోనా తీవ్రత తగ్గడంతో సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులను రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ కొందరు ఎంప్లాయిస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

 మాత్రం వర్క్ ఫ్రం హోం కు బాగా అలవాటుపడిపోయిన ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడడం లేదు.  ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేయడంతో ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా మాకు ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుతున్నారు. హెల్త్ కు సంబంధించిన విషయంలో మాత్ర ప్రత్యేక కేర్ తీసుకోవాలని కోరుతున్నారు. అలా ఉంటేనే కార్యాలయాలకు వస్తామని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై సీఐఈఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ నిర్వహించిన అంశాలను బయటపెట్టింది. ఈ సర్వేలో 80 నుంచి 90 శాతం మంది ఎక్కడి నుంచైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్యాలయలో పనిచేయాల్సి వస్తే తమ ఆలోచనలను పంచుకునే వేదికగా ఉండాలని కోరుతున్నారు. సమాచారాన్ని బదిలీ చేసుకునే హక్కు  కల్పించాలంటున్నారు. అలాగే ఆఫీసుల్లో మౌలిక సదుపాయాలు కచ్చితంగా ఉండాలని కోరుతున్నారు.
Tags:    

Similar News