ఇప్పుడు తెలుగు నేలలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనున్నది. ఇప్పటిదాకా హోరాహోరీగా సాగిన ప్రచారంలో అధికార పార్టీ ఆగడాలపై విమర్శలు ఎక్కుపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... దాదాపుగా తన పార్టీ అభ్యర్థికి విజయం దరి చేర్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించిందన్న అపప్రదను అధికార పార్టీ టీడీపీ మూటగట్టుకుంది.
సాక్షాత్తు ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా విపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే వైసీపీ పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు నిజమేనన్నట్లుగా నంద్యాల డీఎస్పీగా పనిచేస్తున్న గోపాలకృష్ణను విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం నియోజకవర్గానికి పోలీసు అధికారిగా ఉన్న కీలక అధికారిపై పోలింగ్ కు నాలుగు రోజులు ముందుగా బదిలీ వేటు పడటమంటే... అధికార పార్టీకి ఆ అధికారి వత్తాసు పలికినట్లేనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ దెబ్బ నుంచి తేరుకోకముందే టీడీపీకి మరో గట్టి దెబ్బే తగిలేలా ఉంది.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ టీడీపీ అదికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో కాసేపటి క్రితం ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీలను ప్రలోభానికి గుర్తి చేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.