ఏపీలో రాజకీయం మొత్తం కాపుల చుట్టూ తిరుగుతోంది. విభజన ఏపీలో కులాల సంకుల సమరం ఒక రేంజిలో సాగుతోంది. దాంతో ఏపీలో ఏకంగా 17 నుంచి ఇరవై శాతం సాలిడ్ ఓటింగ్ షేర్ ఉన్న కాపులు అధికార దండాన్ని అందించే స్థితిలో ఉన్నారు. వారు తలచుకుంటేనే ఎవరికైనా పవర్ దక్కే సీన్ ఉంది. ఇది 2014, 2019 ఎన్నికల్లో రుజువు అయింది. ఒకసారి టీడీపీకి వన్ సైడెడ్ గా ఓట్లు వేసి గెలిపించిన కాపులు 2019 ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లేసి వైసీపీని అధికారంలోకి తెచ్చారు.
అయితే 2024లో పరిస్థితి అలా ఉండేలా లేదు. ఎందుకంటే కాపుల ఓట్లను క్లెయిం చేయడానికి జనసేన సిద్ధంగా ఉంది. జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి ఆ ఓట్లు బదలాయింపు జరిగే సీన్ ఉంటుంది. సో ఇక్కడ పెద్ద ఎత్తున నష్టపోయేది వైసీపీ మాత్రమే అని అర్ధం అవుతోంది. మరి తనకు రాజకీయ నష్టం జరుగుతూంటే ఏ రాజకీయ పార్టీ చూస్తూ ఊరుకోదు కదా. దానికి తగిన రిపేర్లు ఏవో చేసుకుంటుంది. అందులో భాగంగానే వైసీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కలసి రాజమండ్రీలో తొలిసారి భేటీ వేశారు. ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం కాపుల ఓట్లను తమ పార్టీకి కన్సాల్డేట్ చేసుకోవడం. ౨౦౧౯ లో వఛ్చిన ఓట్ల శాతం ఎంతో కొంత తగ్గినా మెజారిటీ కాపులను తమ వైపునకు ఉండేలా చేసుకోవడం.
జగన్ అనుమతితోనే ఈ మీటింగ్ జరిగినా ఇక్కడ హాజరైన కాపులంతా చర్చించేది తమ రాజకీయ భవితవ్యం గురించి కూడా. రేపటి రోజున జగన్ టికెట్లు ఇస్తే గెలవాల్సింది వారే. వారికి కావాల్సింది కాపు సామాజికవర్గం ఓట్లు. సరే కాపులు జనసేన వైపు టీడీపీ వైపు వెళ్లవద్దు తమతోనే ఉండాలని వైసీపీ నేతలు చెబుతారు కానీ తమతో ఉండడానికి వారికి అందించే అవకాశాలు ఏంటి. వారికి సమకూర్చే ప్రయోజనాలు ఏంటి.
నిజమే ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల కాపులకు కూడా 26 వేల కోట్ల రూపాయల దాకా వివిధ పధకాల దాకా సొమ్ములు దక్కి ఉండవచ్చు. కానీ ప్రత్యేకంగా కాపు సామాజికవర్గానికి ఏం చేశారంటే వైసీపీ నుంచి వచ్చే సమాధానం ఏంటి అన్నదే ఇక్కడ చూడాలంటున్నారు. కాపులు కోరుతోంది ఎమోషనల్ డిమాండ్ తమ ఆత్మగౌరవ డిమాండ్ అయిన బీసీలలో చేర్చడం. లేకపోయినా ప్రస్తుతం అగ్రవర్ణాలకు అందికే పది శాతం ఈబీసీ రిజర్వేషన్లలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇచ్చినా వారు శాంతిస్తారు. అదేమీ లేకుండా మీకు పధకాలు ఇస్తున్నాం, మీ ఓట్లు మాకే అంటే వారు ఊరుకునే సీన్ లేదని అంటున్నారు.
వైసీపీకి చెందిన కాపు నేతలలో కూడా ఇదే రకమైన చర్చ సాగుతోంది. కాపుల మద్దతు దక్కించుకోవాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని కీలకమైన సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు భావిస్తున్నారు. ఇక త్వరలోనే కాపులందరితో భారీ ఎత్తున సభను రాజకీయ రాజధాని విజయవాడలో పెట్టబోతున్నారు ఈ సభ నాటికి వైసీపీలో ఉన్న కాపు నేతలు కాపుల సమస్యలను వారి ఆకాంక్షలను తెలుసుకుని దానికి అనుగుణంగా కొన్ని డిమాండ్లను జగన్ సర్కార్ ముందు పెట్టబోతున్నారు అని చెబుతున్నారు.
అంటే వచ్చే ఎన్నికలు చాలా కీలకం కాబట్టి బలమైన సామాజికవర్గం మద్దతు కోసం వారి చిరకాల కోరికను తీర్చే విధంగా వైసీపీ సర్కార్ అడుగులు వేస్తే రాజకీయంగా సామాజిక పరంగా తాము సేఫ్ జోన్ లో ఉంటామని చెప్పబోతున్నారని ప్రచారం సాగుతోంది. మరి ఏపీలో వైసీపీ ప్రభుత్వం కాపుల కోసం వారిని తమ వెంట ఉంచుకోవడానికి కొన్ని సంచలనమైన నిర్ణయాలను తీసుకోబోతుందా. వెయిట్ అండ్ సీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.