మహమ్మారితో ఎమ్మెల్యే మనవడు.. సెల్ఫీ వీడియో

Update: 2020-06-27 05:30 GMT
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడు గౌతమ్ కరోనా మహమ్మారి బారినపడ్డాడు. ఏడేళ్ల చిన్న పిల్లాడు అయిన గౌతమ్ ప్రస్తుతం ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.  

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గౌతమ్ తన తండ్రి కృష్ణ చైతన్యతో కలిసి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన పేరు గౌతమ్ అని.. తన తాత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అంటూ వీడియోలో చెప్పాడు. ఒంగోలు ఆస్పత్రిలో అందుతున్న చికిత్స బాగుందని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక సెల్ఫీ వీడియోలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండండి అంటూ గౌతమ్ పిలుపునిచ్చాడు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు మనవడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా వచ్చింది. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికీ కూడా పాజిటివ్ గా తేలింది. వీరిందరినీ ఒంగోలులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Tags:    

Similar News