బాడీకి యోగా..బుద్ధికి ఏం నేర్పాలి వీళ్లకి?

Update: 2019-06-21 16:27 GMT
మనవాళ్లకు కొత్తొక వింత పాతొక రోత. ఈ మధ్యనే యోగా డే అని ఐరాస ప్రకటించడంతో దీని పట్ల ఓ రెండేళ్లుగా తెగ క్రేజు పెంచుకున్నారు జనం. ఈరోజు ట్విట్టర్ లో కూడా ట్రెండ్ టాపిక్ ఇదే. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల పబ్లిక్ ప్రైవేట్ సంస్థల్లో యోగా ఏర్పాట్లు సామూహికంగా చేశారు. అంతటా  అంతర్జాతీయ యోగా డే ఘనంగా జరుపుకున్నారు. గవర్నమెంటు ఏర్పాట్లు చేసిన చోట కొన్ని విచిత్ర ఘటనలు జరిగాయి. హర్యానాలోని రోహ్‌ తక్‌ లో పెద్దఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా - సీఎం ఖట్టార్ ఇందులో పాల్గొన్నారు. వీవీఐపీల రాకతో ఖరీదైన యోగా మ్యాట్లు తెప్పించారు

నిర్వాహకులు. దాంతో కొందరు పార్టిసిపెంట్స్ కన్ను ఆ యోగా మ్యాట్ల పై పడింది. అంతే... కార్యక్రమం ముగిసేదాకా వాటిపై ఓ కన్నేసి ఉంచిన కొందరు అయిపోగానే తమ సత్తా చూపించారు. యోగా ముగిశాక ముష్టియుద్ధం మొదలుపెట్టినట్టుగా ఒకరినొకరు తోసుకుని - రాసుకుని - కిందేసుకుని ఆ ఖరీదైన యోగా మ్యాట్లను బలప్రదర్శనతో సొంతం చేసుకుని ఎత్తుకెళ్లారు. వాటిని జనానికి పంచి పెడతాం అని కూడా చెప్పలేదు. అయినా సరే అవేదో తమ ఆస్తి అన్నట్టు ఎత్తుకెళ్లిపోయారు.

పాపం నిర్వహకుల ముఖచిత్రం చూడాలి. అట్లా ఇట్లా వాడిపోలేదు. ఆ గుంపులో ఇక చేసేదేముంది అని వదిలేశారు. మంది సొమ్ము మంది పాలైంది. అంతేగా !!
   

Tags:    

Similar News