యంగ్ డైనమిక్ రాజకీయ నేత ఈ ఫొటోలో ఉన్నారు .. గుర్తు పట్టడానికి ట్రై చేయండి ?
ఈ నాటి యువ రాజకీయ నాయకుల్లో ముందు వరుసలో ఉండే నేత, తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితులు పై ఫోటోలో ఉన్నారు. మీరు గుర్తు పట్టగలరా ? ఒకసారి ట్రై చేసి చూడండి, ఓ ఇంకా గుర్తు రావడం లేదా, అయితే చిన్న క్లూ, ఈ ఫోటో లో పై వరుసలో రెండవ స్థానంలో ఉన్నారు. అయినా ఇంకా మీరు గుర్తు పట్టలేకపోతున్నారా అయితే ..పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. స్వయంగా మంత్రి కేటీఆర్ త్రో బ్యాక్ పిక్ ని ట్విట్టర్ లో తాజాగా షేర్ చేశారు.
తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, రాష్ట్రాభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు ప్రతీ అంశాన్ని ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసే మంత్రి కేటీఆర్, తాజాగా తన వ్యక్తిగత ఫోటోను షేర్ చేశారు. 1984లో తాను 4వ తరగతి చదువుతున్న నాటి ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశాడు. భరత్ అనే తన క్లాస్ మేట్ ఈ ఫోటోను తనకు షేర్ చేశాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కరీంనగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో నాలుగో తరగతి చదివే సమయంలో సహచర విద్యార్థులు, టీచర్లతో దిగిన ఫోటో అని, చాలా సర్ ప్రైజ్ గా ఉందని అన్నారు. దాదాపు ఇందులోని అందరి పేర్లను గుర్తుతెచ్చుకోగలిగానని అన్నారు. మొత్తానికి మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫోటోపై టీఆర్ ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు, నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.