స్టైలిష్‌ స్టార్‌ వైఎస్‌ జగన్‌

Update: 2019-02-25 05:02 GMT
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పేరు వినగానే.. అందరికి ఆయన దండం పెట్టే సీన్‌ గుర్తువస్తుంది. ఆ తర్వాత ఆయన డ్రెస్‌ గుర్తుకు వస్తుంది. గళ్లచొక్కా లేదంటే.. తెల్ల చొక్కా.. క్రీమ్ కలర్‌ ప్యాంట్‌ తోనే ఎక్కువుగా కన్పిస్తారు జగన్‌. పార్టీ కార్యక్రమం అయినా - పాదయాత్ర అయినా.. జగన్‌ డ్రెస్‌ సెన్స్‌ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్ లండన్ వెళ్లారు. మరి లండన్ వెళ్లినప్పుడు అక్కడి పద్ధతుల్ని కూడా మనం అలావాటు చేసుకోవాలి. అక్కడ ప్రజలంతా ఎలా ఉంటారో అలాగే ఉండాలి. అందుకే.. స్టైలిష్‌ స్టార్‌ రా మారిపోయారు జగన్‌. టీషర్ట్‌ - టీషర్ట్‌ పైన  బ్లేజర్‌.. జీన్స్‌ ప్యాంట్‌ విత్‌ బ్లాక్‌ షూస్‌ తో సినిమా హీరోలా మారిపోయారు. జగన్‌ డ్రెస్‌ మారింది కాదీ.. ఆయన స్మైలింగ్ అడ్రెస్‌ మారలేదు. వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చే చిరునవ్వుతో కన్పించారు.

జగన్‌ కుమార్తె వర్షా రెడ్డి లండన్‌ స్కూల్‌ బిజినెస్‌ లో పొలిటికల్ సైన్స్‌ చదువుతోంది. ఆమెను చూసేందుకు జగన్‌ - ఆయన భార్య భారతి రెడ్డి మూడు రోజుల క్రితం లండన్‌ వెళ్లారు. రేపు ఉదయం అంటే.. మంగళవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ వస్తారు. 27న తాడేపల్లిలో జగన్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత.. తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించే అవకాశాలున్నాయి.         
Tags:    

Similar News