అమరావతి దెబ్బకు హైదరాబాద్ లో హౌస్ సేల్స్ డౌన్
ఇదే విషయాన్ని ప్రాప్ ఈక్విటీ సంస్థ కూడా గణాంకాలతో సహా వెల్లడించింది. హైదరాబాద్ లో ఇళ్ల సేల్స్ 36 శాతం తగ్గిందని, క్యూ2లో 15061 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయని వెల్లడించింది.
ఏపీలో గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం పడకేసిన సంగతి తెలిసిందే. జగన్ పుణ్యమా అంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదగాల్సిన రియల్ ఎస్టేట్ రంగం...అధ:పాతాళానికి పడిపోయింది. అమరావతి రాజధాని ఆధారంగా గుంటూరు, విజయవాడ, సీఆర్డీఏ పరిధిలోని భూముల ధరలకు రెక్కలు రావాల్సింది పోయి...ఉన్న రెక్కలు కూడా తెగిపోయాయి. అదే సమయంలో 2019-2024 సమయంలో తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చి రియల్ ఎస్టేటర్ రంగం ఓ వెలుగు వెలిగింది.
ఈసారి కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చతికిలబడుతుంది అనుకుంటున్న తరుణంలో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో ఏపీలో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. అమరావతి దెబ్బకు హైదరాబాద్ లో హౌస్ సేల్స్ డౌన్ అయ్యాయి.
ఇదే విషయాన్ని ప్రాప్ ఈక్విటీ సంస్థ కూడా గణాంకాలతో సహా వెల్లడించింది. హైదరాబాద్ లో ఇళ్ల సేల్స్ 36 శాతం తగ్గిందని, క్యూ2లో 15061 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయని వెల్లడించింది. ఎన్నికలు, కొత్త ప్రభుత్వాల ఏర్పాటు నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలోని ప్రధాన నగరాలలో కూడా ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. జనవరి మార్చి తో పోలిస్తే 18 శాతం సేల్ తగ్గిందని తెలిపింది.