‘గాడ్స్ ప్లాన్..’ ‘టైమ్..’ ఆ క్రికెటర్ కు ఈ రెండూ నిజాలే కాదు టాట్టూలూ

టీమ్ ఇండియా టి20 ఫినిషింగ్ స్టార్ రింకూ సింగ్ జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే అతడు ఇప్పుడున్నది ఎన్నో రెట్ల మెరుగైన జీవితం అనుకోవాలి.;

Update: 2025-04-07 21:30 GMT
‘గాడ్స్ ప్లాన్..’ ‘టైమ్..’ ఆ క్రికెటర్ కు ఈ రెండూ నిజాలే కాదు టాట్టూలూ

తండ్రి గ్యాస్ డెలివరీ చేస్తుంటాడు.. ఉన్నది చిన్న ఇల్లు.. ఊరు ఓ మాదిరి సిటీ.. కుటుంబ బంధాలు.. బాధ్యతలు.. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుర్రాడు క్రికెట్ ను నమ్ముకున్నాడు.. కష్టాల్లోనూ బ్యాట్ ను వదల్లేదు.. ఇప్పుడదే ఆ కుటుంబాన్ని గొప్పగా నిలిపింది.

రూ.3 కోట్ల తో విల్లా కొనుక్కుని.. కొంత ఆస్తులు కూడబెట్టేంత స్థాయికి తీసుకెళ్లింది.

టీమ్ ఇండియా టి20 ఫినిషింగ్ స్టార్ రింకూ సింగ్ జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే అతడు ఇప్పుడున్నది ఎన్నో రెట్ల మెరుగైన జీవితం అనుకోవాలి.

మనందరం చెప్పుకొనేది గాడ్స్ ప్లాన్ (విధిరాత అనుకోవచ్చు), టైమ్.. ఈ రెండూ కలిసి వస్తే మనిషి ఎక్కడికో వెళ్తాడు. క్రికెటర్ రింకూ సింగ్ కూడా వీటినే నమ్మినట్టున్నాడు.

ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన రింకూ తన ఎడమ భుజంపై ‘గాడ్స్ ప్లాన్’ అని, కుడివైపు 2.20 అనే సమయం చూపుతూ టాట్టూలు ఉంటాయి. వీటి వెనుక ఉన్న కథను అతడు వెల్లడించాడు.

2018 ఐపీఎల్ వేలంలో రింకూను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ డబ్బు అతడి జీవితాన్ని మార్చేసింది. దీంతో ఇల్లు కొనడమే కాదు.. తోబుట్టువుల వివాహాలు చేశాడు. ఇక 2:20 చూపించే గడియారం టాట్టూ.. 2018 వేలంలో అతడు కేకే ఆర్ కు సంతకం చేసిన సమయం.

కాగా, కేకేఆర్ ఎంపిక చేయడానికి ముందు అలీగఢ్ లోని చిన్న ఇంటిలో ఉన్న రింకూ తర్వాత డూప్లెక్స్ బంగ్లా కొన్నాడు. 2018 వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. కేకేఆర్ తరఫున 2022లో గుజరాత్ పై ఒకే ఓవర్ లో ఐదు సిక్స్ లు కొట్టిన అతడు టీమ్ ఇండియా తలుపు తట్టాడు. ఇక ఆ తర్వాత వెనక్కుతిరిగి చూసుకోలేదు.

అందుకే గాడ్స్ ప్లాన్ ప్రకారం తాను కేకేఆర్ కు సంతకం చేసిన సమయం మధ్యాహ్నం 2.20ను టాట్టూలుగా వేసుకున్నాడు.

Tags:    

Similar News