ఈ వారం ఓటీటీ రిలీజులివే!
ఈ వారం ఓటీటీలోకి ఏయే సినిమాలు రిలీజవుతున్నాయి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రిలీజవుతున్నాయో తెలుసుకుందాం.;

ప్రతీ వారం లానే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఎప్పటిలానే కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరికొన్ని ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలోకి ఏయే సినిమాలు రిలీజవుతున్నాయి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రిలీజవుతున్నాయో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ లో..
తమిళ మూవీ పెరుసు ఏప్రిల్ 11 న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది.
హాలీవుడ్ వెబ్ సిరీస్ కిల్ టోనీ ఏప్రిల్ 7న రిలీజవుతోంది.
హాలీవుడ్ వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
హాలీవుడ్ మూవీ ఫ్రోజెన్ హాట్ బాయ్స్ ఏప్రిల్ 10న స్ట్రీమింగ్ కానుంది.
ప్రైమ్ వీడియోలో...
హాలీవుడ్ మూవీ ఛోరీ2 ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.
జియో హాట్‌స్టార్ లో..
బాలీవుడ్ యానిమేషన్ సిరీస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ లో..
తెలుగు సినిమా లైఫ్ పార్టనర్ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు మూవీ ఉత్తరం ఇప్పటికే రిలీజైంది.
తెలుగు సినిమా టుక్ టుక్ ఏప్రిల్ 10 నుంచి అందుబాటులోకి రానుంది.
సోనీలివ్ లో..
ప్రావింకూడు షాపు అనే మలయాళ సినిమా తెలుగులో కూడా ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవనుంది.