ఇంచార్జ్ పాల‌న‌లో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గం.. 100 % నిజ‌మే...!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నందికొట్కూరు

Update: 2023-07-19 07:03 GMT

అదేంటి? అని అనుకుంటున్నారా? ఎక్క‌డైనా జ‌రుగుతుందా? అని చ‌ర్చించుకుంటున్నారా? అయితే.. ఇదేదో చ‌దివి తీరాల్సిందే. తెలుసుకోవాల్సిందే. సాధార‌ణంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉంటే.. అక్క‌డ గెలిచిన‌.. ప్ర‌జ‌లు గెలిపించిన నాయ‌కుడు ఎమ్మెల్యే అయి పాల‌న చేస్తాడు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో అయితే.. ఎంపీ అధికారం చ‌లాయిస్తారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన సాగుతున్న రాజ‌కీయం. కానీ, చిత్రంగా వైసీపీ ప‌రిధిలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇంచార్జ్ పాల‌నే సాగుతోంద‌ని బాహాటం గానే నాయ‌కులు రోడ్డెక్కుతున్నారు.

ఆ నియోజ‌క‌వ‌ర్గమే ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నందికొట్కూరు. ఇది ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఆర్థ‌ర్ వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. 2019 ఎన్నిక‌ల ముందు.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఇక్క‌డ ప‌రిస్థితి మారిపోయింద‌ని పెద్ద ఎత్తున వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఎందుకంటే.. ఏం జ‌ర‌గాల‌న్నా.. బైరెడ్డి ఆదేశాలే శిరోధార్యంగా ఇక్క‌డ ప‌ని చేస్తున్నాయ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే అనేక సార్లు వివాదాలు ర‌చ్చ‌కెక్క‌డం.. తాడేప‌ల్లిలో పంచాయితీలు పెట్ట‌డం కూడా జ‌రిగిపోయింది. అయినా. కూడా ఇక్క‌డ బైరెడ్డి ప‌రిస్థితి మార‌లేద‌ని.. ఎమ్మెల్యే ఆర్థ‌ర్ వ‌ర్గం చెబుతోంది. వాస్త‌వానికి బైరెడ్డిని సంతృప్తి ప‌రిచేందుకు ఆయ‌న‌కు శాప్ చైర్మ‌న్ ప‌ద‌విని సీఎం జ‌గ‌న్ అప్ప‌గించారు.

అయినా.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వం స‌హా అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా ర‌ని, ఎన్నికల ముంగిట బైరెడ్డి దూకుడు మ‌రింత పెరిగింద‌ని కూడా చెబుతున్నారు. తాజాగా రెండు రోజుల కింద‌ట నందికొట్కూ రు నియోజ‌క‌వ‌ర్గంలో క్రీడా ప్రాంగ‌ణాన్ని ప్రారంభించారు.

అయితే.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేగా ఉన్న‌ ఆర్థ‌ర్‌కు ఆహ్వానం అంద‌లేదు. అంతేకాదు.. మంత్రి రోజా కూడా వ‌చ్చినా కూడా ఎమ్మెల్యే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌లేదు. ఇక‌, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి కూడా ఆర్థ‌ర్‌ను ప‌ట్టించు కోలేదు.

దీంతో తాజాగా ఆర్థ‌ర్ వ‌ర్గం.. రోడ్డెక్కింది. ఇంచార్జ్ పాల‌న‌ను తొల‌గించాలంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌డంతో పాటు వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఎన్నిక‌ల‌కు ముందు.. నందికొట్కూరు రాజ‌కీయం హాట్‌గా మార‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

Tags:    

Similar News