గేను పెళ్లాడితే.. ఉద్యోగం పోయినట్లే!

Update: 2015-07-04 09:10 GMT
పెళ్లి చేసుకోగానే.. ప్రమోషన్‌లు ఇస్తుంటాయి కొన్ని కంపెనీలు. కానీ అమెరికాలో మాత్రం పెళ్లి చేసుకున్న వెంటనే ఉద్యోగాలు పీకేస్తున్నారు. అయినా పెళ్లి చేసుకోవడం అంత పెద్ద తప్పా అనుకోకండి. అబ్బాయి, అమ్మాయి పెళ్లాడితే సమస్య లేదు. కానీ ఇక్కడ అబ్బాయి, అబ్బాయి.. అమ్మాయి, అమ్మాయి పెళ్లాడేస్తున్నారు. ఈ సంస్కృతి మరీ శ్రుతి మించి పోతుండటంతో గే, లెస్బియన్‌ మ్యారేజ్‌ చేసుకున్న వాళ్లకు కంపెనీలు టాటా చెప్పేస్తున్నాయి. గే మ్యారేజెస్‌కు చట్టబద్దత కల్పిస్తూ ఈ మధ్యే అమెరికా అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఐతే ఈ తీర్పు మీద అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న భారత సంతతి సెనేటర్‌ బాబీ జిందాల్‌తో పాటు పలువురు ప్రముఖులు నిరసన గళం వినిపించారు.

రాజకీయ నాయకుల మద్దతు లభిస్తుండటంతో చాలా కంపెనీలు గే మ్యారేజెస్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. దీని మీద స్వలింగ సంపర్కుల సంఘాలు మండిపడుతున్నాయి. 'మ్యారీడ్‌ ఆన్‌ సండే.. ఫైర్డ్‌ ఆన్‌ మండే' అనే కాన్సెప్ట్‌ను ప్రచారం చేస్తున్నాయి. ఐతే కంపెనీలు మాత్రం ఈ విషయంలో మొహమాటపడట్లేదు. టెన్నిసీలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ.. 'మా సంస్థలో గేలకు ప్రవేశం లేదు' అని బోర్డు కూడా పెట్టేసింది. ఐతే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తమ హక్కుల్ని కాలరాస్తారా అంటూ మండిపడుతున్నాయి గే, లెస్బియన్‌ కమ్యూనిటీస్‌. తమ పట్ల వివక్షను నిరసిస్తూ ఆందోళన బాట కూడా పడుతున్నాయి.

Tags:    

Similar News