నెపం OTTపైకి నెట్టేసిన సూపర్‌స్టార్
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు వచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ఇంటికే సినిమా వస్తోంది. ఓటీటీల రాకతో అంతా మారిపోయిందని కూడా అమీర్ ఖాన్ అన్నారు.;
కాస్త ఆలస్యంగా అయినా అమీర్ ఖాన్ ఒక సత్యాన్ని ఒప్పుకున్నారు. దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్ అంత మంచి సినిమాలు తీయడం లేదని, హిందీ పరిశ్రమలో మూలాల్ని మర్చిపోయి సినిమాలు తీస్తున్నారని నిజాయితీగా అంగీకరించారు. అదే సమయంలో ఓటీటీలు సినిమాల మనుగడకు పెద్ద ఆటంకంగా మారాయని కూడా ఆవేదన చెందారు.
మంచి సినిమా వస్తేనే జనం థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు. లేదంటే ఎనిమిది వారాలు ఆగి ఓటీటీలో చూస్తున్నారు. ప్రతి సినిమా కోసం థియేటర్లకు రావడం లేదని అమీర్ ఖాన్ విశ్లేషించారు. ఒకే ఉత్పత్తి (సినిమా)ని రెండు సార్లు అమ్ముకుంటున్నాం. జనం అంత తెలివితక్కువ వాళ్లు కాదు రెండుసార్లు కొనేందుకు. థియేటర్లకు రాకుండా ఓటీటీలో చూడటం కోసం వేచి చూస్తున్నారని అమీర్ ఖాన్ విశ్లేషించారు. బాలీవుడ్ వ్యాపార నమూనాపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసారు.
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు వచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ఇంటికే సినిమా వస్తోంది. ఓటీటీల రాకతో అంతా మారిపోయిందని కూడా అమీర్ ఖాన్ అన్నారు. నిజమే మంచి సినిమాలు వస్తేనే జనం థియేటర్లకు వెళుతున్నారు.
స్త్రీ2, పుష్ప 2, చావా మంచి సినిమాలు గనుకే జనం థియేటర్లకు వచ్చి మరీ చూసారు. ఇటీవల బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోను చెత్త సినిమాలు చాలా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. దీనికి నెపం ఓటీటీలపైకి నెట్టేయకూడదు. చెత్త సినిమా తీసామని మేకర్స్ అంగీకరించాలి. సరే.. ఓటీటీల గొప్పతనాన్ని అంగీకరించిన అమీర్ ఖాన్, ఇకపై వరుసగా మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.