పెళ్లిపై మరోసారి నరేష్ కామెంట్.. ఏమన్నారంటే..

తాజాగా మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయింది. పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న హీరో నారా రోహిత్ సుందరకాండ మూవీలో నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Update: 2024-08-26 13:10 GMT

సీనియర్ నటుడు నరేష్.. సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే సినిమాలతోపాటు ఆయన పెళ్లిళ్ల మ్యాటర్ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు డిస్కసింగ్ టాపిక్ గా ఉంటుంది. కొన్ని నెలలుగా ఆయన నటి పవిత్రా లోకేష్ తో కలిసి ఉంటున్నట్లు టాక్.

ఈ విషయంపై నరేష్ మూడో భార్య రమ్య రఘపతి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, దూషించుకోవడం, కోర్టులకు వెళ్లడం.. ఇదంతా తెలిసిందే. దీంతో నరేష్ కు పలు ఈవెంట్స్ లో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఆయన వినూత్నంగా స్పందిస్తుంటారు. తాజాగా మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయింది. పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న హీరో నారా రోహిత్ సుందరకాండ మూవీలో నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

అయితే సుందరకాండ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఆ సమయంలో నరేష్ కు.. పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి.. పెళ్లి అయితే హ్యాపీనా కాకపోతేనా.. అని మీడియా ప్రతినిధి అడిగారు. దీంతో తమ జనరేషన్ వారు ఇంకోసారి పెళ్లి ట్రై చేద్దామని అనుకుంటున్నారని నరేష్ తెలిపారు. ఇప్పటి తరం అసలు పెళ్లి వద్దని, ఇంతకు ముందు తరాలు వాళ్ళేమో మరొక్కసారి ట్రై చేద్దామని అంటున్నట్లు చెప్పారు. పెళ్లి హ్యాపీగా ఉండడానికే కదా అని నరేశ్ అన్నారు.

అందుకే తాను కూడా ఈ మధ్యలో.. అంటూ ఏదో చెప్పబోయి మాటను ఆపేశారు. ఇక నరేష్ వ్యాఖ్యలకు ఓ రేంజ్ లో అంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నరేష్.. కొన్ని నెలల క్రితం పవిత్రా లోకేష్ తో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు. యావరేజ్ రెస్పాన్స్ అందుకున్న ఆ మూవీ అప్పట్లో ఫుల్ వైరల్ గా మారింది.

ఇక రీసెంట్ గా దాదాపు ఐదు ఎకరాల్లో నిర్మితమైన విజయ కృష్ణ స్మృతి వనాన్ని నరేష్ ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రాండ్ గా జరిగిన ఆ కార్యక్రమానికి పవిత్ర లోకేష్ తో కలిసి వచ్చారు నరేష్. అప్పుడు పవిత్రనే కార్యక్రమంలో హైలెట్ గా నిలిచారు. ఇద్దరూ కలిసి ఉన్న పిక్స్, వీడియోస్ అప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి విషయంలో నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News