బ‌ల‌వంతంగా ముద్దాడారు.. స‌హ‌న‌టుల‌పై న‌టి ఆరోప‌ణ‌

మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో `హేమ క‌మిటీ రిపోర్ట్` ప్ర‌కంప‌నాలు కొన‌సాగుతున్నాయి.

Update: 2024-08-27 08:30 GMT

మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో `హేమ క‌మిటీ రిపోర్ట్` ప్ర‌కంప‌నాలు కొన‌సాగుతున్నాయి. మ‌హిళా న‌టీమ‌ణుల‌పై లైంగిక వేధింపులు, ఆన్ లొకేష‌న్ వారి అసౌక‌ర్యాల గురించి ఈ నివేదిక చాలా విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టిన కొన్ని గంట‌ల్లోనే చాలా మంది న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇంకా వ‌స్తూనే ఉన్నారు!!

ఇంత‌కుముందే ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ రంజిత్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన న‌టి శ్రీ‌లేఖ మిత్రా పోలీస్ కేసు పెట్ట‌గా, అత‌డిపై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మలయాళ ప్రముఖ నటి రేవతి సంపత్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనపై ప్రముఖ నటుడు, నిర్మాత సిద్దిఖీ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ రేవతి సంపత్ తీవ్రంగా ఆరోపించారు.

ఇప్పుడు మ‌రో న‌టి మిను మునీర్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపిస్తూ ప్రముఖ మలయాళ నటుల పేర్ల‌ను బ‌య‌ట పెట్టారు. ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. చ‌ర్చ‌ల పేరుతో పిలిచి తన తోటి నటులే తనను వేధింపులకు గురి చేశారని మిను వాపోయింది. ముఖేష్, మణియం పిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య అనే నలుగురు నటులు తనని సెట్స్‪లో శారీరకంగా వేధించారని ఆరోపించింది.

న‌టీన‌టుల సంఘం(అమ్మా)లో మెంబ‌ర్‌షిప్ కోసం సంప్రదించగా `అమ్మ` మాజీ కార్యదర్శి ఇడవెల బాబు తన ఫ్లాట్‌కు పిలిచి శారీరకంగా వేధించాడని మిను మునీర్ ఆరోపించింది. ప్రస్తుత కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ కూడా తనను కమిట్‌మెంట్ పేరుతో వేధించాడ‌ని.. దానికి నిరాకరించినందున‌ `అమ్మా`లో సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకున్నారని మిను మునీర్ ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది.

డైరెక్ట‌ర్ రంజిత్‌కి నాన్ బెయిల‌బుల్ వారెంట్:

కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత రంజిత్‌పై న‌టి శ్రీ‌లేఖ మిత్రా కొచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిత్రా ఇటీవల రంజిత్ లైంగిక దుష్ప్రవర్తనపై తీవ్రంగా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సోమ‌వారం నాడు రంజిత్ పై పోలీస్ కేసును న‌మోదు చేసింది.

2009లో రంజిత్ దర్శకత్వం వహిస్తున్న `పలేరిమాణిక్కం` చిత్రంలో త‌న‌ పాత్ర గురించి చర్చల కోసం కొచ్చిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌కు పంపిన ఇ-మెయిల్‌లో మిత్రా వివరించింది. చర్చల‌ సమయంలో రంజిత్ తన చేతిని పట్టుకుని లైంగిక ఉద్దేశ్యంతో త‌న‌ శరీరంలోని ఇతర భాగాలను తాకడానికి ప్రయత్నించాడని మిత్రా ఆరోపించింది. ``పాలేరిమాణిక్కం సినిమాలో నటించమని రంజిత్ నన్ను ఆహ్వానించారు. చర్చలో భాగంగా కొచ్చిలోని కాలూరు కడవంత్రాలో శ్రీ రంజిత్ ఉంటున్న ఫ్లాట్‌కి నన్ను పిలిచారు. చర్చల సమయంలో అతడు నా చేతిని పట్టుకున్నాడు. తరువాత లైంగిక ఉద్దేశ్యంతో అత‌డి చేతిని నా శరీరంలోని ఇతర భాగాలపై వేసేందుకు ప్రయత్నించాడు. అతడు పిల‌వ‌డం వెన‌క‌ ఉద్దేశం సినిమా గురించి కాదని, లైంగిక ఉద్దేశ్యంతో మాత్ర‌మేన‌ని గ్రహించి, నేను ఫ్లాట్ నుండి తప్పించుకుని నేను బస చేసిన హోటల్‌కి వెళ్లవలసి వచ్చింది. నా చేదు అనుభవాన్ని మరుసటి రోజు స్క్రిప్ట్ రైటర్ శ్రీ జోషి జోసెఫ్ కి వెల్ల‌డించాను. నా తిరుగు ప్రయాణానికి ట్రావెలింగ్ టికెట్ ఇవ్వనందున శ్రీ జోషి జోసెఫ్ సహాయం కోరవలసి వచ్చింది`` అని తన ఫిర్యాదులో రాసింది.

మిత్రా తాను కూడా కోల్‌కతా నుండి వచ్చినందున, స్థానిక న్యాయ ప్రక్రియ గురించి తెలియని కారణంగా మొదట చట్టపరమైన చర్య తీసుకోలేదని, అయితే ఇప్పుడు ముందుకు వెళ్లాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు వెల్ల‌డించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా, నేరం జరిగిన సమయంలో భారతీయ శిక్షాస్మృతిలోని 354 & 354 బి సెక్షన్‌లను ఆకర్షించే నేరానికి శ్రీ రంజిత్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి నేను ఈ ఫిర్యాదు చేస్తున్నాను

అని మిత్రా మెయిల్ లో రాసింది. మిత్ర తన ఇ-మెయిల్‌ను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, రంజిత్‌పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొచ్చి పోలీసులను అభ్యర్థించింది. రాత‌పూర్వ‌క ఫిర్యాదు ఇవ్వాల‌ని కొంద‌రంటున్నారు. కానీ సుప్రీం తీర్పు ప్ర‌కారం.. ఈమెయిల్ ఫిర్యాదు అర్హ‌మైన‌ది అని మిత్రా వ్యాఖ్యానించారు.

గౌరవనీయ సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి రాతపూర్వక ఫిర్యాదు తప్పనిసరి కాదు. రాతపూర్వక ఫిర్యాదు తప్పనిసరి అని కేరళ రాష్ట్రంలోని ప్రజా కార్యకర్తలు తీసుకున్న ప్రజా వైఖరిని దృష్టిలో ఉంచుకుని మీ భూభాగంలో నేరం జరిగినందున నేను మీ మంచి వ్యక్తికి ఇమెయిల్ ద్వారా ఈ ఫిర్యాదును చేస్తున్నాను. నేరస్థుడిపై క్రిమినల్ చర్య తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శులు పట్టుబట్టినట్లుగా, దీనిని ఫిర్యాదుగా పరిగణించి చట్టాన్ని అమలులోకి తీసుకురావచ్చు`` అని తన ఫిర్యాదులో పేర్కొంది.

వేధింపుల‌పై డాక్యుమెంట్:

ఈ నెల ప్రారంభంలో మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుద‌లైంది. 235 పేజీల పత్రంలో వేధింపులు దోపిడీకి సంబంధించిన ఆందోళనకరమైన విష‌యాల‌ను క‌మిటీ బ‌హిర్గ‌తం చేసింది.

Tags:    

Similar News