నటి రహస్య పెళ్లిలో ట్విస్టు.. చివరకు విడాకులు!
చివరిగా `అపోల్లెనా`లో కనిపించిన అదితి శర్మ తన భర్త అభినీత్ కౌశిక్ తో రిలేషన్‌షిప్ గురించి కొన్ని షాకింగ్ వివరాలను షేర్ చేసిన తర్వాత ఇప్పుడు విడాకులు అనే తుఫాన్‌లో చిక్కుకుంది.;
కొన్ని హై ప్రొఫైల్ పెళ్లిళ్లు రహస్యంగానే మిగిలిపోతాయి. నాలుగు నెలల క్రితం రహస్యంగా పెళ్లాడిన ప్రముఖ టీవీ నటి తన భర్త నుంచి విడిపోతూ, అతడిని రూ. 25 లక్షలు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఈ పెళ్లి గురించి పరిశ్రమ సహచరులకు, పరిశ్రమ ప్రముఖులకు అస్సలు తెలీదు. ఈ నటి మరెవరో కాదు.. ప్రముఖ టీవీ నటి అదితీ శర్మ.
చివరిగా `అపోల్లెనా`లో కనిపించిన అదితి శర్మ తన భర్త అభినీత్ కౌశిక్ తో రిలేషన్‌షిప్ గురించి కొన్ని షాకింగ్ వివరాలను షేర్ చేసిన తర్వాత ఇప్పుడు విడాకులు అనే తుఫాన్‌లో చిక్కుకుంది. కలీరీన్, యే జాదు హై జిన్ కా! చిత్రాలతో ఈ నటి పాపులరైంది. ఇప్పుడు అదితీ రహస్య వివాహం బ్రేకప్ అవుతుండడం అభిమానులకు నిజంగా షాకిస్తోంది. నాలుగు నెలలకే ఈ పెళ్లి బ్రేక్ అవుతోందనే వార్త వేడెక్కిస్తోంది.
అదితి శర్మ రహస్యంగా వివాహం చేసుకుంది. కానీ ఈ పెళ్లి వివరాలేవీ తన బంధువులకు, కొలీగ్స్ కు కూడా తెలియవు. అదితి కౌశిక్ భర్త గా చెబుతున్న అభినీత్ కౌశిక్ ఇండియా ఫోరమ్‌లను సంప్రదించి కొన్ని షాకింగ్ వివరాలను షేర్ చేసారు. అతడి లీగల్ కన్సల్టెంట్ రాకేష్ శెట్టి ఈ ఉదంతంపై మాట్లాడారు. వారిద్దరూ నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. 12 నవంబర్ 2024న చాలా రహస్యంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ జోడీ తమ గోరేగావ్ ఇంట్లో వివాహం చేసుకున్నారు. 6 నెలల క్రితం కలిసి ఉండటానికి 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. గత 4 నెలలుగా ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు. అంతా చాలా సజావుగా జరుగుతోంది. అతిధి తన భర్తకు ప్రేమగా బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఖత్రోన్ కే ఖిలాడి రియాలిటీ షో కోసం పనిచేస్తున్న సమయంలో అతడు ఆమెతో ఉండటానికి విమానంలో వచ్చాడు. వారి వివాహం గురించి ఎవరికీ తెలియదు... అని లాయర్ చెప్పారు.
అభినీత్ కౌశిక్ ఓ పోర్టల్ తో మాట్లాడుతూ వినోద పరిశ్రమలో తన కెరీర్ కారణంగా వివాహాన్ని రహస్యంగా ఉంచాలని అదితీ కోరిందని వెల్లడించారు. తాను పెళ్లి కోసం సిద్ధంగా లేకపోయినా అదితీ బలవంతం చేసిందని కూడా అభినీత్ చెప్పాడు. ప్రారంభంలో తాను ఉత్సాహంగా ఉన్నానని, కానీ కాలం గడిచేకొద్దీ తనకు సందేహం వచ్చిందని ఆయన వెల్లడించారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత తాను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించానని అభినీత్ అన్నారు. అదితికి ఎవరికీ తెలియకూడదని షరతు పెట్టింది. భాగస్వామిగా తన కెరీర్ కి కావాల్సిన మద్ధతునిచ్చానని అన్నాడు. అదితీ కజిన్స్ కి మాత్రం పెళ్లి గురించి తెలుసునని కూడా వెల్లడించాడు.