25 ఏళ్ల త‌ర్వాత అరుదైన క‌ల‌యిక‌!

ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన `భూత్ బంగ్లా` 2 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో ఒక అరుదైన‌ మ్యాజిక్ రిపీట‌వుతోంది.

Update: 2025-01-19 17:30 GMT

ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన `భూత్ బంగ్లా` 2 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో ఒక అరుదైన‌ మ్యాజిక్ రిపీట‌వుతోంది. అది కూడా 25 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత పెద్ద తెర‌పై ట‌బు - అక్ష‌య్ హిట్ పెయిర్ ని తిరిగి అభిమానులు చూడ‌బోతున్నారు.

ఇటీవ‌లే అక్షయ్ కుమార్ `భూత్ బంగ్లా` సెట్స్‌పై టబును స్వాగతించ‌గా, అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. నిర్మాతలు ఇన్‌స్టాలో అక్కీ- ట‌బు ఆత్మీయ ఆలింగ‌నానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసారు. రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ ఈ క‌ల‌యిక రిపీట‌వుతోంది. అక్షయ్ - టబు గతంలో కల్ట్-క్లాసిక్ `హేరా ఫేరి`లో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకున్నారు. ఇంత‌కాలానికి `భూత్ బంగ్లా` కోసం క‌లిసి న‌టిస్తున్నారు.

ఈ అరుదైన క‌ల‌యిక రిపీట‌వుతోంద‌ని తెలియ‌గానే అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ హర్రర్ కామెడీలలో ఒకటిగా మారింది. దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ అక్షయ్, టబులను తిరిగి కల‌ప‌డం ద్వారా ఒక పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టిస్తార‌ని ఫ్యాన్స్ న‌మ్ముతున్నారు.

ఈ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ - అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫారా షేక్, వేదాంత్ బాలి, ఏక్తా క‌పూర్ నిర్మాత‌లు. కథను ఆకాష్ ఎ కౌశిక్ రాశారు. స్క్రీన్‌ప్లేను రోహన్ శంకర్, అభిలాష్ నాయర్, ప్రియదర్శన్ రూపొందించారు. రోహన్ శంకర్ సంభాషణలు రాశారు. ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ జైపూర్‌లో జరుగుతోంది. 2 ఏప్రిల్ 2026న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News