ఫోటో స్టోరి: న‌ట‌వార‌సులు జీవితం త‌ల‌కిందులు

క్రమం తప్పకుండా వ్యాయామాలు, క్రమశిక్షణతో కూడుకున్న‌ జీవనశైలితో అద్భుత‌మైన లుక్ ని మెయింటెయిన్ చేస్తోంది.

Update: 2025-01-13 04:38 GMT

సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ చూపించే భామ‌ల్లో ఆల‌య ఎఫ్ ఒక‌రు. పూజా భేడి గారాల కుమార్తె ఆల‌య‌కు ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప‌లు ఫ్యాష‌న్ బ్రాండ్ల ప్ర‌చార‌క‌ర్త‌గా ఇప్ప‌టికే యూత్ లో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతోంది. అలయ ఎఫ్ తన ఫిట్‌నెస్ డైరీలతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు, క్రమశిక్షణతో కూడుకున్న‌ జీవనశైలితో అద్భుత‌మైన లుక్ ని మెయింటెయిన్ చేస్తోంది.


యువ‌న‌టి ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ లో జిమ్- వ్యాయామ సెషన్‌లకు సంబంధించిన చాలా వీడియోలు క‌నిపిస్తాయి. వాటిలో ఉదయాన్నే ఫిట్‌నెస్ దినచర్య, వెయిట్స్ శిక్షణ, కార్డియో వంటివి ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. వ్యాయామం తర్వాత భోజనం ఏం తినాలో కూడా ఆల‌య మార్గ‌ద‌ర్శ‌నం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆల‌య ఇటీవ‌ల జిమ్‌లో పైలేట్స్ సెషన్ నుంచి కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.


ఆల‌య జిమ్ లో క‌స‌ర‌త్తుల‌తో పాటు యోగా ప్రాక్టీస్ చేస్తున్న‌ప్ప‌టి ఫోటోలు వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంది. యోగాలో సంక్లిష్ఠ‌మైన ఎన్నో ఆస‌నాల‌ను ఈ బ్యూటీ ఇంత‌కుముందు ప‌రిచ‌యం చేసింది. యోగాస‌నాల వ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను కూడా వివ‌రించింది. ఇప్పుడు ఒక విచిత్ర‌మైన అస‌నాన్ని ఆల‌య ప‌రిచ‌యం చేసింది. ఆల‌య ఒక గోడ‌ను ఆనుకుని అస‌నం వేసింది. అయితే ఇది శీర్షాస‌నం కాదు.. మ‌న‌కు తెలిసిన ఏ అస‌నం కూడా ఇలా లేదు.


ఇది క‌చ్ఛితంగా ఆల‌య క్రియేటివిటీ నుంచి పుట్టుకొచ్చిన అస‌నం. ఇలా చేయ‌డం ద్వారా మెద‌డులోకి ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగ‌వుతుంది. అయితే దీనికి ఆల‌య ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. ఇటీవలి జీవితం ఇలా ఉంది అని వెల్ల‌డించిన ఆల‌య‌.. జనవరి మొదటి అర్ధభాగంలో ఎక్కువ భాగం తలక్రిందులుగా గడిపాను కానీ ఎప్పుడూ ఇంతగా నిశ్చింతగా అనిపించలేదు.. అని రాసింది. అలా రెండు కాళ్ల‌ను మెలిపెట్టి, గోడ‌కు ఆన్చి, చేతుల‌ను నేల‌పై ఆస‌రాగా ఉంచి, అస‌లు ఆల‌య ఎఫ్ మునులు ఎవ‌రూ క‌నిపెట్ట‌ని కొత్త భంగిమ‌ను క‌నిపెట్టిందా? అంటూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ప్ర‌స్తుతం ఈ ఇంట్రెస్టింగ్ యోగ భంగిమ అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతోంది.


ఆలయ రెగ్యుల‌ర్ గా తీవ్రమైన పైలేట్స్ సెషన్ నుండి కొన్ని భంగిమ‌ల‌ను చూపించే ఇన్‌సైడ్ వీడియోను కూడా ఇంత‌కుముందు షేర్ చేసింది. ఆల‌య‌ ఫిట్‌నెస్ ప్రయాణం నుండి గ్లింప్స్ నిరంత‌రం ఆస‌క్తి ని క‌లిగిస్తున్నాయి. ఆల‌య‌ వీడియోలు, ఫోటోలు చూశాక‌ పరిశ్రమలోని అత్యంత ఫిటెస్ట్ తారలలో ఒక‌రిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ప్రముఖ నటి పూజా బేడి, వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలా కుమార్తె అయిన అలయ 2020లో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి `జవానీ జానేమాన్‌`తో బాలీవుడ్‌లో న‌టిగా రంగ ప్రవేశం చేసింది. తరువాత ఫ్రెడ్డీ, DJ మొహబ్బత్‌, ఆల్మోస్ట్ ప్యార్, బడే మియాన్ చోటే మియాన్, శ్రీకాంత్ వంటి చిత్రాలలో నటించింది. త‌దుప‌రి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో రూపొంద‌నున్న‌ డ్రామా సిరీస్‌లోను చేరే ఛాన్సుంద‌ని తెలిసింది. ఈ సిరీస్‌లో షనాయ కపూర్‌తో కలిసి అలయ న‌టిస్తోంది. రీతూ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News