ఆది-నిక్కీ.. వ్వాటే రొమాంటిక్ మూమెంట్స్!

ఈ జంట తరచుగా తమ సంతోష క్షణాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.;

Update: 2025-03-14 06:43 GMT

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన పాత్రలతో గుర్తింపు పొందిన ఆదిపినిశెట్టి, కోలీవుడ్‌లో తన గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన నిక్కీ గల్రాని ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారారు. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ సినిమాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ జంట, ప్రేమ వివాహం చేసుకుని జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సినిమాల ద్వారా పరిచయమైన వీరి ప్రేమ దశలవారీగా పెరిగి చివరకు పెళ్లి బంధంగా మారింది.


ఈ జంట తరచుగా తమ సంతోష క్షణాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పుడు మాల్దీవుల్లో వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న వెకేషన్ ఫోటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సముద్ర తీరంలోని సూర్యాస్తమయ సమయాన్ని వీరు ఎంతో రొమాంటిక్‌గా ఆస్వాదిస్తున్నారు. ఒక ఫోటోలో నిక్కీ లియోపార్డ్ ప్రింటెడ్ డ్రెస్‌లో హాట్ లుక్‌తో మెరిసిపోగా, ఆదిపినిశెట్టి క్యాజువల్ అవతార్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.


సముద్రం పక్కన సూర్య కాంతిలో వీరి డిన్నర్ సెటప్ మరింత అందంగా కనిపిస్తోంది. అలాగే, మరొక ఫోటోలో ఆదిపినిశెట్టి భుజంపై పక్షి కూర్చొని ఉండగా, వెనుక భాగంలో నిక్కీ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ మరింత ఫ్రెష్ వైబ్ తెచ్చింది. ఈ జంట తమ ప్రయాణాన్ని మధురంగా మార్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. హోటల్ గదిలో నిక్కీ నీలి కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తుండగా, ఆదిపినిశెట్టి వెనుక నుంచి ఆమెను హత్తుకుని ఉన్న ఫోటో వీరి కెమిస్ట్రీ ఎంత స్పెషల్‌గా ఉందో చూపిస్తోంది.


ఇక విమాన ప్రయాణంలో కూడా వీరిద్దరూ స్టైలిష్ లుక్స్‌ అదరగొట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్ పరంగా ఆసక్తికరమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఆదిపినిశెట్టి త్వరలోనే ప్రధాన పాత్రలో కొన్ని విభిన్న కథా చిత్రాల్లో నటించబోతున్నాడు. ముఖ్యంగా అఖండ 2లో అతను విలన్ గా కనిపించబోతున్నాడు. మరోవైపు నిక్కీ గల్రాని తన తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ తమ వ్యక్తిగత జీవితం, కెరీర్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News