అక్క ద‌ర్శ‌క‌త్వంలో త‌మ్ముడికి ఛాన్స్ ఇవ్వ‌దా!

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ద‌స‌రా` హిట్ త‌ర్వాత భారీ ప్రాజెక్ట్ ల్లో భాగ‌మ‌వుతున్నాడు.;

Update: 2025-03-14 07:22 GMT

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ద‌స‌రా` హిట్ త‌ర్వాత భారీ ప్రాజెక్ట్ ల్లో భాగ‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఓదేల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యారడైజ్` లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉండ‌గానే మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు ఒకే చేసి ముందుకెళ్తున్నాడు. అటు నిర్మాత‌గా వాల్ పోస్ట‌ర్ సంస్థ‌లో సినిమాలు నిర్మిస్తున్నాడు. అందుకు సోద‌రి గంటా దీప్తి స‌హ‌కారం ల‌భిస్తోంది.

ప్రొడ‌క్ష‌న్ కి సంబంధించిన వ్యవ‌హారాలు ఆమె చూసుకుంటుంది. `మీట్ క్యూట్` సినిమాతోనూ దీప్తి ద‌ర్శ‌కురాలిగా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు తెర‌కె క్కించ‌లేదు. మ‌రి ఇంట్లో నాని హీరోగా ఉండ‌గా? ఓ సినిమా చేయోచ్చు క‌దా? అన్న ప్ర‌పోజ‌ల్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. అయితే నాని ఛాన్స్ ఇచ్చినా? త‌ను మాత్రం తమ్ముడికి ఛాన్స్ ఇవ్వ‌నంటోంది.

`మీట్ క్యూట్` త‌ర్వాత మ‌రికొన్ని క‌థ‌లు సిద్దం చేసుకున్నా. భ‌విష్య‌త్ లో వాటిని తెర‌పైకి తెస్తా. కానీ వాటిలో ఎందులోనూ నాని ఉండ‌డు. త‌మ్ముడితో సినిమా చేసే ఆలోచ‌న మాత్రం నాకు లేదు. త‌ను అవ‌కాశం ఇచ్చినా? నేను ఇవ్వ‌ను. అక్కా-తమ్ముడు ఒకే సినిమా సెట్ లో ఉండ‌కూడ‌ద‌ని న‌వ్వేసింది. `కోర్టు` సినిమా కోసమే అమెరికా నుంచి హైద‌రాబాద్ వ‌చ్చాను. ఆరు నెల‌లు ప‌నిచేసాను.

ఆన్ సెట్ ప్రొడ్యూస‌ర్ గా అన్ని ప‌నులు చూసుకున్నాను. నాని, ప్ర‌శాంతి నాకు కావాల్సిన స్వేచ్ఛ‌ను ఇచ్చారు. అనుకున్న బ‌డ్జెట్ లోనే సినిమా పూర్తయింది. నాని క‌థ‌ను బ‌లంగా న‌మ్మాడు. ఆన‌మ్మ‌కంతోనే `కోర్టు` హిట్ అవ్వ‌క‌పోతే త‌న `హిట్ 3` సినిమా చూడొద్ద‌న్నాడు` అని అన్నారు.

Tags:    

Similar News