అల్లు అర్జున్ అరెస్ట్.. చైతూ ఏమన్నాడంటే..

డిసెంబర్ 4వ తేదీ రాత్రి.. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్స్ టైమ్ లో తొక్కిసలాట జరగ్గా.. ఓ మహిళ మృతి చెందింది.

Update: 2025-02-01 10:24 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీ రాత్రి.. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్స్ టైమ్ లో తొక్కిసలాట జరగ్గా.. ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.

ముందుగా మధ్యంతర బెయిల్ పొందిన బన్నీ.. తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందారు. ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. కానీ తొక్కిసలాట కేసు తర్వాత అల్లు అర్జున్.. ఏ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు నాగచైతన్య తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత బన్నీ పాల్గొనున్న ఫస్ట్ ఈవెంట్ అదే కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ అభిమానులకు కార్యక్రమానికి అనుమతి లేదని తెలుస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్.. తన అరెస్టు, కొత్త చిత్రాలు, చైతూ కోసం ఏం మాట్లాడుతారోనని ప్రజలతోపాటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య.. బన్నీ అరెస్ట్ గురించి మాట్లాడారు. "ఏం జరిగినా దురదృష్టకరం. అలా ఎప్పుడూ జరగకూడదు. మేము ఒకరికొకరు అండగా ఉన్నాం. అల్లు అర్జున్ ఏమి అనుభవించారో నాకు తెలుసు. కానీ ఇది జీవితం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు" అని చైతూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు చైతూ తండేల్ మూవీ ఈవెంట్ కే బన్నీ రానున్నారు. కాబట్టి నాగచైతన్య కూడా బన్నీ గురించి ఏం మాట్లాడతారో ఆసక్తికరమే. అయితే తండేల్ సినిమా.. ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి తండేల్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News