హీరోకి 100 కోట్లు ఫీజు.. సినిమాకి జీరో బజ్
ఓవైపు దక్షిణాది హీరోలు ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి వాళ్లు వయసుతో పాటు క్రేజ్‌ని పెంచుకుంటుంటే, ఈ బాలీవుడ్ స్టార్‌కి క్రేజ్ అంతకంతకు తగ్గిపోతోంది.;
స్టార్ హీరోకి 100 కోట్ల పారితోషికం చెల్లించారు. కానీ సినిమాకి అసలు బజ్ అన్నదే లేదు. రిలీజ్‌కి సిద్ధమైన అతడి సినిమా ప్రచార సామాగ్రికి స్పందన అంతంత మాత్రమే. ఆన్ లైన్ క్లిక్ లు లైక్ ల రేసులోను సదరు హీరో వెనకబడ్డాడు. వయసు షష్ఠిపూర్తికి దగ్గర పడుతుంటే హీరోగారి క్రేజ్ అంతకంతకు తగ్గుతోంది. ఓవైపు దక్షిణాది హీరోలు ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి వాళ్లు వయసుతో పాటు క్రేజ్‌ని పెంచుకుంటుంటే, ఈ బాలీవుడ్ స్టార్‌కి క్రేజ్ అంతకంతకు తగ్గిపోతోంది. ఈ హీరో మరెవరో కాదు.. ది గ్రేట్ సల్మాన్ భాయ్.
సల్మాన్ నటించిన 'సికందర్' 28 మార్చి 2025న ఈద్ స్పెషల్ గా విడుదలవుతున్నా ఇప్పటివరకూ ఆశించిన బజ్ ని సంపాదించడంలో విఫలమైంది. ఈ సినిమాకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇది ఒక సోషల్ డ్రామా. యాక్షన్ థ్రిల్స్ కి కొదవేమీ ఉండదు. రష్మిక లాంటి యంగ్ ఛామ్ సల్మాన్ కి కలిసొస్తుందా లేదా వేచి చూడాలి.
తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్ కు రూ. 100 కోట్ల పారితోషికం చెల్లించారని తెలిసింది. సినిమా ఫలితాన్ని బట్టి లాభాల్లో వాటా కూడా సల్మాన్ తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సాజిద్ నదియాద్వాలా ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. సికందర్ కి నాన్ థియేట్రికల్ హక్కుల్లో డిమాండ్ ఉన్నా కానీ, థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆశించిన బజ్ లేదని ట్రేడ్ లో కథనాలొస్తున్నాయి.
ఇటీవల విడుదలైన సల్మాన్ మాస్ అవతార్ జస్ట్ ఓకే అనిపించింది. అయితే ట్రైలర్ తో దీనిని మరో స్థాయికి తీసుకుని వెళితే కొంతవరకూ ఓపెనింగుల పరంగా బజ్ రావొచ్చు. కానీ, ఇప్పటివరకూ ప్రచారంతో నీరసం వచ్చిందే కానీ హుషారు పెరగలేదు. వంద కోట్లు అందుకుంటున్న హీరో సినిమాకి బజ్ పెంచాలి కదా? అని ఒక సెక్షన్ ప్రశ్నిస్తోంది. చివరి నిమిషంలో సల్మాన్ భాయ్ ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో వేచి చూడాలి.