ఫేమస్ అవ్వడం కోసమే ఇద్దరి మధ్యా చిచ్చు పెట్టిందా?
అమ్మడు స్కిన్ షోతో కుర్రాళ్లలో కాకలు పుట్టించింది. సొగసరి అందానికి యువత ఫిదా అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనూ నిలిచింది.;
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు సంచలనమైతే అందులో నటీనటులు ఓవవర్ నైట్ లో ఫేమస్ అయిపోతారు. అలాంటి చిన్న సినిమాల్లో ఇటీవల రిలీజ్ అయిన ప్రదీప్ రంగనాద్ నటించి `డ్రాగన్` ఒకటి. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ సంగతి పక్కన బెడితే ఇందులో సెకెండ్ హీరోయిన్ గా నటించిన కయాదు లోహర్ బాగా ఫేమస్ అయింది.
అమ్మడు స్కిన్ షోతో కుర్రాళ్లలో కాకలు పుట్టించింది. సొగసరి అందానికి యువత ఫిదా అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనూ నిలిచింది. అప్పుడే తెలుగు సినిమాలు కూడా సైన్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఎంపికైందని సమాచారం. అయితే ఈ భామ కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య పెద్ద చిచ్చే రేపింది.
ఇటీవల ఓ కాలెజ్ ఈవెంట్లో అభిమానులు మీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగితే తలపతి విజయ్ పేరు చెప్పింది. సర్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అందులోనూ విజయ్ నటించిన `తేరి` సినిమా ఎన్నిసార్లు చూసానో? తనకే తెలియదంది. అయితే ఇదే బ్యూటీ గతంలో తన అభిమాన హీరోగా ధనుష్ పేరు చెప్పింది. అతడి హిట్ సినిమాల గురించి తెగ పొగిడేసింది. ఇలా ఇద్దరుహీరోల పేర్లు చెప్పడంతో? ఆ హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేగింది.
ఇద్దరు హీరోల అభిమానులు కయాదు ను లైక్ చేసిన వారు కావడంతో ఈ కుంపంటి మొదలైంది. కయాదు కు మా హీరో మాత్రమే క్రష్ అంటూ ఇరువురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో యుద్దానికి తెర తీసారు. అయితే కయాదు ఇలా చెప్పడానికి కారణం ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మరింత ఫేమస్ అవ్వం కోసమే ఈ డ్రామాకి తెర తీసిందంటూ మరికొంత మంది అభిమానులు మండి పడుతున్నారు. దీనికి తెర పడాలంటే కయాదు హీరోలిద్దరు సమానమే అంటే తప్ప పంచాయతీ తెగదు.