విదేశీ లొకేష‌న్లు డిమాండ్ చేయ‌లేదా?

ఇప్ప‌టికే ప్ర‌ధాన పాత్ర‌ల‌పై షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే య‌శ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.;

Update: 2025-03-09 14:30 GMT

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిష్ తివారీ ఇతిహాసం `రామాయ‌ణం` ఆధారంగా `రామాయ‌ణ్` ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్.. సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి...రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్..హ‌నుమంతుడి పాత్ర‌లో స‌న్నిడియోల్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన పాత్ర‌ల‌పై షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే య‌శ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుగుతోంది. ర‌ణ‌బీర్ క‌పూర్, య‌శ్ పై తాజా షెడ్యూల్ లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈ షెడ్యూల్ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం. కొత్త షెడ్యూల్ వ‌చ్చే వారం మ‌ళ్లీ ముంబైలోనే మొద‌ల‌వుతుంది. ఇందులో య‌శ్ పై రాముడి లేని కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించినున్న‌ట్లు తెలుస్తోంది. రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్లే స‌న్నివేశాలు చిత్రీకరించ‌నున్నారట‌.

అందుకోసం ప్ర‌త్యేక‌మైన సెట్ల‌ను సిద్దం చేసి పెట్టారట‌. సినిమాలో ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన నాటి నుంచి చిత్రీక‌ర‌ణ అంతా ముంబైలోనే జ‌రుగుతోంది. అక్క‌డే అప్ప‌టి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా సెట్లు వేస్తున్నారు. కొన్ని స‌న్నివేశాలు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక‌రించారు. ఈ రెండు చోట్ల మేజ‌ర్ పార్ట్ షూటింగ్ జ‌రిగింది.

ఇంత వ‌ర‌కూ రామాయ‌ణం విదేశీల‌కు వెళ్లింది లేదు. ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ సినిమాటిక్ లిబ‌ర్టీ కూడా తీసుకోకుండా ముందుకెళ్తున్నారు. దీంతో విదేశీ లొకేష‌న్ల‌ను రామాయ‌ణం డిమాండ్ చేయ‌న‌ట్లే క‌నిపిస్తోంది. రామాయ‌ణం పూర్తిగా భార‌త్ తోనే ముడిప‌డిన క‌థ‌. ఈ నేప‌థ్యంలో ముంబైలోనే అవ‌స‌ర‌మైన సెట్లు అన్ని వేసి చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

Tags:    

Similar News