మైత్రి చేతికి ‘దిల్‌రూబా’ - గ్రాండ్ రిలీజ్ పక్కా!
లవ్ స్టోరీస్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో చూపించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ సినిమా, ట్రైలర్ ద్వారా ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది;
టాలీవుడ్‌లో తనదైన మాస్ అండ్ లవ్ స్టోరీ మిక్స్‌తో సినిమాలు చేస్తూ, యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ‘దిల్‌రూబా’ అనే మరో విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లవ్ స్టోరీస్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో చూపించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ సినిమా, ట్రైలర్ ద్వారా ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
ఇక మైత్రీ మూవీస్ ఇప్పటికే ఎంతో మంది యంగ్ హీరోల సినిమాలను రిలీజ్ చేసి విజయం సాధించగా, ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’కి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ‘క’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో మరో బలమైన కథను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
ట్రైలర్‌ను గమనిస్తే, ఇందులో లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ సమపాళ్లలో మేళవించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్, పాటలు ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకోగా, నైజాం హక్కులు మైత్రీ మూవీస్ తీసుకోవడం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా మేజర్ హైలైట్ లవ్ అండ్ యాక్షన్ మిక్స్ కానుంది. ట్రైలర్‌లో ‘సారీ రా సిద్ధు’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్, దానికి హీరో ఇచ్చిన కౌంటర్ ఆసక్తికరంగా మారింది.
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలై, ఫ్యామిలీ ఎమోషనల్ యాంగిల్‌కు మారే కథలో, హీరో పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా, కిరణ్ అబ్బవరం గతంలో చేసిన సినిమాల కంటే ఇందులో అతని యాక్షన్ మోడ్ మరింత అగ్రెసివ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ‘కన్నా నీ’ అనే పాట యూత్‌లో బాగా పాపులర్ అయ్యింది. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. లవ్ స్టోరీతో పాటు, ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతున్న ఈ సినిమా, థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాను విశ్వ కరణ్ దర్శకత్వంలో రూపొందించారు. సరేగామ రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా ప్రధాన బలంగా నిలిచేలా ఉంది. ఇక మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను నైజాంలో హ్యాండిల్ చేయడం వలన బిజినెస్ పరంగా కూడా సినిమాకు మంచి బూస్ట్ ఇవ్వనుంది.