నేటి హీరోయిన్లకు తిరుగులేదంటోన్న మేటి భామలు!
తాజాగా నాటి-మేటి కథానాయికల మధ్య వ్యత్యాసాన్ని వెటరటన్ నటి మధుబాల చెప్పే ప్రయత్నం చేసారు.;
కాలంతో పాటు మార్పులెన్నో జరుగుతుంటాయి. ట్రెండ్ కు తగ్గట్టు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపో తో పోటీ అనే ప్రపంచంలో ఎంతగా వెనుకబడతాం? అన్నది చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈ విషయంలో హీరోయిన్లు మరింత అప్రమత్తంగా వ్యవరించాలి. ఎత్తుకు పై ఎత్తులు ఏస్తూ ముందుకెళ్లాలి. ఇండస్ట్రీలో సక్సస్ తో పాటు ఈరకమైన తెలివి తేటలు లేకపోతే నెట్టుకురావడం కష్టమన్ని అనుభవజ్ఞుల మాట.
పదేళ్లు..20 ఏళ్ల లాంగ్ కెరీర్ కొనసాగిస్తున్నారంటే? అదంత ఈజీగా వచ్చింది కాదు. ట్యాలెంట్...సక్సెస్ తో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ చురుకుగా ఉండటంతోనే ఇది సాధ్యమవుతుంది. తాజాగా నాటి-మేటి కథానాయికల మధ్య వ్యత్యాసాన్ని వెటరటన్ నటి మధుబాల చెప్పే ప్రయత్నం చేసారు. `ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఒకప్పటి నాయికలది. కాదు అనే మాట వచ్చేది కాదు. ప్రతీ దానికి తల ఊపాల్సి వచ్చేది.
కానీ నేటి నాయికల తీరు వేరు. రోజులతో పాటు వాళ్లు మారారు కాబట్టే ఇది సాధ్యమైంది. నేటి తరం నాయికలు పక్కా వ్యూహంతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అందరూ సమానమే అన్న ఆలోచనతో పని చేస్తున్నారు. ఇదే అందరు కోరుకునేది. కానీ పాత రోజుల్లో ఇలాంటి భావన చాలా మందిలో కనిపించేది కాదు. అమాయకంగా పనిచేసే వాళ్లం` అన్నారు.
అలాగే జ్యోతిక అభిప్రాయం ఏంటంటే? `అగ్ర హీరోలకు ధీటుగా నేటి నాయికలు పని చేస్తున్నారు. అలాంటి కథలతో దర్శక, రచయితలు ముందుకొస్తున్నారు. నటీమణులు కేవలం ఒక్క భాషకే పరిమితం కావడం లేదు. మంచి పాత్ర అయితే ఎక్కడైనా చేయడానికి సిద్దంగా ఉంటున్నారు. తామెంటో నిరూపించు కోవడానికి కంపర్ట్ జోన్ దాటి బయటకు వస్తున్నారు` అని అన్నారు.