తెలుగు లోగిళ్ల‌లో భాగ్యం నాటి నాయిక‌ల్లా!

తెలుగు అమ్మాయే అయినా ఓన్ చేసుకోవ‌డానికి మాత్రం ఐశ్య‌ర్యా రాజేష్ విష‌యంలో చాలా స‌మ‌యం ప‌ట్టింది అన్న‌ది వాస్త‌వం.;

Update: 2025-03-09 15:30 GMT

తెలుగు అమ్మాయే అయినా ఓన్ చేసుకోవ‌డానికి మాత్రం ఐశ్య‌ర్యా రాజేష్ విష‌యంలో చాలా స‌మ‌యం ప‌ట్టింది అన్న‌ది వాస్త‌వం. `భా` అంటూ భాగ్యం ఒక్క డైలాగుతో తెలుగు అమ్మాయి పెర్పార్మెన్స్ అంటే ఇలా ఉంటుంది? అని నిరూపించింది. `సంక్రాంతికి వ‌స్తున్నాం` చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ కి భార్య పాత్ర‌లో న‌టించిన ఐశ్వ‌ర్యా రాజేష్ కిప్పుడు తెలుగు ఆడియ‌న్స్ నీరాజ‌నాలు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఆమెకంటూ ప్ర‌త్యేక‌మైన అభిమ‌మానులు ఏర్ప‌డ్డారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో ఓ ప్ర‌త్యేక న‌టిగా గొప్ప స్థానాన్ని సంపాదించింది. ఒక‌ప్పుడు ఇలాంటి ఇల్లాలి పాత్ర‌లు పోషించాలంటే? సౌంద‌ర్య‌, ఆమ‌ని, ర‌మ్య‌కృష్ణ లాంటి న‌టులు మాత్రమే స‌రితూగేవారు. అప్ప‌ట్లో వాళ్ల న‌ట‌న‌కు మాత్ర‌మే అలాంటి ఆడియ‌న్స్ ఉండేవారు. మ‌ళ్లీ చాలా కాలానికి అలాంటి అభిమానుల్ని ఐశ్వ‌ర్యా రాజేష్ ఒక్క సినిమాతో సంపాదించుకుంది.

అయితే ఈ స‌క్సెస్ ఐశ్వ‌ర్య‌కు అంత తేలిగ్గా రాలేదు. తెలుగు అమ్మాయి అయినా ఐశ్వ‌ర్య‌కు తెలుగు వాళ్లు అవ‌కాలివ్వ‌లేదు. చిన్న‌ప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన `రాంబంటు`లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించింది. కానీ హీరోయిన్ గా మాత్రం కోలీవుడ్ అవ‌కాశిలిచ్చింది. అక్క‌డ నిరూపించుకున్న త‌ర్వాత టాలీవుడ్ లో ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. ఆరేళ్ల క్రిత‌మే `కౌస‌ల్య కృష్ణ‌మూర్తి` సినిమాలో న‌టించింది.

ఆ త‌ర్వాత `మిస్ మ్యాచ్`, `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`, `రిప‌బ్లిక్` లాంటి చిత్రాల్లో న‌టించింది. ఇవేవి కూడా ఐశ్వ‌ర్య‌ని టాలీవుడ్ లో బిజీ న‌టిగా మార్చ‌లేక‌పోయాయి. దీంతో కోలీవుడ్ లో కొన‌సాగుతూనే ఇక్క‌డ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడిలో ఆమె లో కొత్త యాంగిల్ చూసాడు. అలా `సంక్రాంతికి వ‌స్తున్నాం` లో వెంకీ భార్య పాత్ర‌కు అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమా స‌క్సెస్ తో ఐశ్వ‌ర్యకు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయ‌ని స‌మాచారం.

Tags:    

Similar News