పుష్ప 2 కావేరి.. చీరలో అందాల మెరుపులా..
'పుష్ప 2' సినిమా విజయం సాధించడంతో అందులోని ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.;
'పుష్ప 2' సినిమా విజయం సాధించడంతో అందులోని ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ‘కావేరి’ పాత్రలో నటించిన పావని కరణం ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ సింపుల్ లుక్‌లో కనిపించే పావని, తాజాగా స్టైలిష్ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతూ కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పావని, తాజాగా గోల్డెన్ శారీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రాముఖ్యమైన అవార్డు షో కోసం స్టైలింగ్ అన్ని స్వయంగా చేసుకున్నానని తెలిపింది. ఆమె కర్లీ హెయిర్, మినిమల్ మేకప్, జ్యువెలరీతో ఓ రాయల్టీ ఫీల్‌ను తీసుకువచ్చింది. సింప్లిసిటీ లో ఉండే అందాన్ని మరోసారి నిరూపించిన ఈ లుక్స్, నెటిజన్లను మాయ చేస్తున్నాయి. నైట్ లైట్స్ లో ఆమె ఫోజ్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.
పావని కరణం కెరీర్ విషయానికొస్తే, ఆమె 'పరేషాన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. "సమోసా తింటావా శిరీష?" అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నా చితకా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు, 'పుష్ప 2'లో కీలక పాత్ర పోషించడం ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయ్యింది. పుష్ప రాజ్ అన్నయ్య కూతురుగా 'కావేరి' పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ సినిమాలో తన నటన ఎంత బలమైనదో ఇప్పుడు ఈ ఫోటోషూట్‌లోనూ తన గ్లామర్‌తో మరోసారి నిరూపిస్తోంది.
సాధారణంగా నటీనటులు వెస్ట్రన్ లుక్స్‌లో హాట్ ఫోటోషూట్‌లు చేస్తుంటారు. కానీ పావని ట్రెడిషనల్ లుక్‌లోనూ అందాన్ని చాటుకోవచ్చు అని ప్రూవ్ చేసింది. ఎప్పుడూ మోడరన్ లుక్‌లో కాకుండా, సింప్లిసిటీ లోనూ ఎంత అద్భుతంగా మెరిసిపోవచ్చో ఈ ఫోటోలు చెబుతున్నాయి. అంతే కాకుండా అవార్డును పట్టుకుని ఇచ్చిన పోజులు ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ లా నిలిచేలా ఉన్నాయి. త్వరలో పావని మరిన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.