మాళవిక శర్మ బోల్డ్ లుక్స్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్
టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక శర్మ తన ఫొటో షూట్స్ తో కుర్రకారును గట్టిగానే ఆకట్టుకుంటుంది.;
టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక శర్మ తన ఫొటో షూట్స్ తో కుర్రకారును గట్టిగానే ఆకట్టుకుంటుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియా ద్వారా తన ప్రత్యేకమైన స్టైల్‌ను చూపిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇటీవలే ఈ భామ ఓ బోల్డ్ ఫోటోషూట్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ అండ్ వైట్ టోన్‌లో తీసిన ఈ ఫోటో ఆమె స్టన్నింగ్ లుక్స్‌తో వైరల్ అవుతోంది.
మూడ్ ఫోటోగ్రఫీకి కొత్త దారులు వేసేలా మాళవిక చూపిన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మాళవిక శర్మ, ఆ తర్వాత ‘రెడ్’ చిత్రంతో సక్సెస్ అందుకుంది. కానీ, అనంతరం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ సినిమాలకు వెళ్ళిపోయింది. ఇటీవల ‘కాఫీ విత్ కాదల్’, ‘భీమా’, ‘హరోం హర’ వంటి చిత్రాల్లో నటించినా, అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
దీంతో మాళవిక తన కెరీర్‌ను నడిపించుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఫోటోషూట్‌లు, బ్రాండ్ ప్రమోషన్లతో పాటు, తన గ్లామర్ పిక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. తాజాగా వచ్చిన ఈ ఫోటోషూట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఓపెన్ షర్ట్, బోల్డ్ లుక్స్‌తో మాళవిక తన హాట్ సైడ్‌ను చూపిస్తూ, ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘కొన్ని మహిళలు అణచివేయబడటానికి కాదు.. వారిని అర్థం చేసుకునే ఎవరో ఒకరు వస్తే వారితో స్వేచ్ఛగా పరిగెత్తడం ఉత్తమం’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఈ మాటలు ఆమె గ్లామర్ లుక్స్‌తో మిళితమై నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోషూట్‌పై లైకులు, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. గతంలోనూ మాళవిక సోషల్ మీడియాలో చాలా గ్లామరస్ లుక్స్ షేర్ చేసుకుంది. కానీ, ఈ సారి పూర్తి బోల్డ్ స్టైలింగ్‌తో దర్శనమివ్వడం విశేషం.
ప్రత్యేకంగా కుర్చుని ఇచ్చిన ఈ స్టన్నింగ్ లుక్స్ ఆమె అట్రాక్షన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మాస్ క్యాప్షన్, స్టైల్, లుక్స్ అన్నీ కలిపి మాళవిక ఈసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసేసింది. ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇలాంటి ఫోటోషూట్‌లే ప్రధాన కారణం అనే చెప్పాలి. ప్రస్తుతం మాళవిక సినిమాల కంటే, సోషల్ మీడియా ప్రమోషన్లు, బ్రాండ్ షూట్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. మరి ఆమె భవిష్యత్తులో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.