రీరిలీజ్‌తో హిట్టు కొట్టి 'రేస్ 4' ఛాన్స్ ప‌ట్టేశాడు

ఒక మంచి విజ‌యం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ప‌రాజ‌యం నీర‌సానికి దారి తీస్తుంది.;

Update: 2025-03-10 01:30 GMT

ఒక మంచి విజ‌యం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ప‌రాజ‌యం నీర‌సానికి దారి తీస్తుంది. ఒకే ఒక్క విజ‌యం న‌టుడికి నాలుగు అడ్వాన్సులు సులువుగా అందించ‌గ‌ల‌దు. ఇప్పుడు అలాంటి ఒక స‌ద‌వ‌కాశం అందుకున్నాడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే. కరోనా క్రైసిస్ స‌మ‌యంలో విడుద‌లై ఫ్లాప్‌గా మారిన `స‌న‌మ్ తేరి క‌స‌మ్` రీరిలీజ్‌లో బంప‌ర్ హిట్టు కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రీరిలీజ్‌లో 20కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక‌ సంచ‌ల‌నం. మొద‌టిసారి రిలీజ్ కంటే నాలుగురెట్లు అధికంగా వ‌సూలు చేసింది.

మొత్తానికి రీరిలీజ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కి ఇప్పుడు కొత్త అవ‌కాశాలు వెంట‌ వ‌స్తున్నాయి. తాజాగా సైఫ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న క్రేజీ ఫ్రాంఛైజీ చిత్రం రేస్ 4లో అవ‌కాశం అందుకున్నాడు. ఇందులో అత‌డు విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. సైఫ్ అలీ ఖాన్ రేస్ 4లో గ్రాండ్ రిటర్న్ ఇస్తున్నాడు.. కానీ సినిమా దర్శకుడు, నటీనటులు, లొకేషన్‌ల గురించి వివరాలు గోప్యంగా ఉంచారు.

తాజా స‌మాచారం మేర‌కు హర్షవర్ధన్ రాణే ఫ్రాంచైజీలో చేరుతున్నాడు. రేస్ 4లో విలన్ పాత్ర కోసం హర్షవర్ధన్ రాణే ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌తో చర్చలు జరుపుతున్నాడు. ఫిలింఫేర్ క‌థ‌నం ప్రకారం.. 2025లో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకడిగా మారాడు హర్షవర్ధన్. సనమ్ తేరి కసమ్ రీరిలీజ్ లో స‌క్సెస్ సాధించ‌డం, అతడికి కొత్త ద్వారాలు తెరిచింది. ప్ర‌స్తుతం పెద్ద ఆఫర్లు వస్తున్నాయి.

రేస్ 4 టీమ్‌లో మ‌రో క్రేజీస్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా కూడా చేరతారని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, హర్షవర్ధన్ ఇద్దరూ విలన్లుగా న‌టిస్తారా? లేక‌ హర్ష్ - సిద్ధార్థ్ న‌డుమ‌ ఫేసాఫ్ ఉంటుందా? అన్న‌ది వేచి చూడాలి. ఇటీవల నిఖిల్ అద్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు.. సైఫ్ కి స‌న్నిహితుడైన‌ ఓం రౌత్ ఈ ప్రాజెక్టుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్సుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది యాక్షన్-థ్రిల్లర్ కు కొత్త ప‌రిణామం.

రేస్ 3 కి రెమో డిసౌజా దర్శకత్వం వహించ‌గా, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, సాకిబ్ సలీమ్ త‌దిత‌రులు న‌టించారు. ఇప్పుడు రేస్ 4 సెట్స్‌ పైకి వెళ్ల‌నుంది. స్టార్ కాస్టింగ్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Tags:    

Similar News