చాహ‌ల్‌తో డేటింగ్ పుకార్లను ఖండించిన బ్యూటీ

అభిమానులు హార్దిక్ పాండ్యా- జాస్మిన్ వాలియా ఇద్ద‌రినీ అదే కార్యక్రమంలో క‌లిసి మెలిసి జాలీగా ఉండ‌టాన్ని చూసారు.;

Update: 2025-03-10 03:27 GMT

టీమిండియా ఆట‌గాడు యుజ్వేంద్ర చాహల్ త‌న భార్య ధ‌న‌శ్రీ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అతడు కొత్త‌గా డేటింగ్ ప్రారంభించాడు అంటూ పుకార్ మొద‌లైంది. ఆర్జే మహవాష్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత‌డితో కలిసి కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్లు వేడెక్కిస్తున్నాయి. ఈ జంట‌ కలిసి హాయిగా కనిపించారు. మహవాష్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలలో కూడా కలిసి కనిపించారు. ఒక‌రితో ఒక‌రు స‌ర‌దాగా మాట్లాడుకుంటూ, చిల్లింగ్ గా న‌వ్వుకుంటూ స‌న్నిహితంగా క‌నిపించారు. దీంతో వారి సంబంధం గురించి కొత్త ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆర్జే మహవాష్ గతంలో దీనిని ఖండించిన విష‌యాన్ని మ‌రువ‌కూడ‌దు. 2024లో వారిద్ద‌రూ క‌లిసి ఉన్న‌ క్రిస్మస్ ఫోటో వైరల్ అయిన తర్వాత ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. అభిమానులు హార్దిక్ పాండ్యా- జాస్మిన్ వాలియా ఇద్ద‌రినీ అదే కార్యక్రమంలో క‌లిసి మెలిసి జాలీగా ఉండ‌టాన్ని చూసారు.

చాహల్, మహవాష్ మధ్య డేటింగ్ గురించి పుకార్లు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 2024లో చాహల్ తన భార్య కొరియోగ్రాఫ‌ర్ ధనశ్రీ వర్మ నుండి విడిపోయాడని క‌థ‌నాలొచ్చాయి. అదే స‌మ‌యంలో క్రిస్మస్ వేడుక నుండి ఆర్జే మ‌హ‌వాష్‌తో చాహ‌ల్ ఫోటో వైరల్ అయింది. ఆ సమయంలో మహవాష్ త‌న‌పై వ‌స్తున్న‌ నిరాధారమైన పుకార్లను ఖండించారు. అవ‌న్నీ నిరాధారమైనవి.. తప్పుదారి పట్టించేవి అని పేర్కొన్నారు. స్నేహితులు క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు వారికి ప్రైవ‌సీని ఇవ్వాల‌ని కోరారు.

అయితే ఇప్పుడు మ‌రోసారి బహిరంగంగా క్రికెట్ మ్యాచ్ లో జంట‌గా క‌నిపించ‌డంతో మ‌ళ్లీ పుకార్లు మొద‌ల‌య్యాయి. ఆమె ఎవ‌రు? అంటూ ప‌లు జాతీయ మీడియాలు క‌థ‌నాలు వైర‌ల్ చేసాయి. అయితే అభిమానులు మహవాష్ గతంలో పుకార్ల‌ను ఖండించిన విష‌యాన్ని కూడా సోష‌ల్ మీడియాల్లో గుర్తు చేస్తున్నారు. ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి క‌నిపించ‌కూడ‌దా? అని ఆర్జే మ‌హ‌వాష్ వ్యాఖ్యానించిన విష‌యాన్ని ఫ్యాన్స్ రిమైండ్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా పుకార్లు పుట్టించ‌వ‌ద్ద‌ని కూడా ఆర్జే మ‌హ‌వాష్ కోరిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్ సమయంలో అభిమానులు చాహల్ -మహవాష్ జంట‌ను మాత్రమే కాదు.. హార్దిక్ పాండ్యా అతడి కొత్త లేడీ లవ్ జాస్మిన్ వాలియా ను కూడా గమనించారు. జాస్మిన్ స్టాండ్లలో కనిపించి హార్థిక్ ఆట‌ను ఆస్వాధిస్తూ, అత‌డిని ఉత్సాహ‌ప‌రుస్తూ ఛీర్ లీడ‌ర్ గా మారిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

Tags:    

Similar News