విశ్వక్ సేన్ ‘లైలా’.. ఓటీటీలో కూడా అదే పరిస్థితి!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా లైలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.;
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా లైలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ఆశించిన స్థాయిలో రన్ ఇవ్వలేకపోయింది. ఓపెనింగ్స్ కూడా చాలా నిరాశపరిచాయి. తక్కువ రోజులకే థియేట్రికల్ రన్ ముగిసిపోయిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయ్యింది.
అయితే థియేటర్స్ లో చప్పగా సాగిన రిసెప్షన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ పెద్దగా మారలేదు. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆడియన్స్ దీనిని ఆసక్తిగా వీక్షించారు. కానీ ఫలితం అనుకున్నట్టుగా రాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, విజయ్ సేన్ క్యారెక్టర్ డిజైన్ ఇలా ఏ అంశంలోనూ సినిమా ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు సినిమా పై పెదవి విరుస్తూ కామెంట్లు పెడుతున్నారు.
థియేటర్లలో ఫెయిలయ్యింది, కనీసం ఓటీటీలో అయినా నయం చేస్తుందేమో అనుకున్నారు కానీ అక్కడ కూడా రిసెప్షన్ అంతంత మాత్రంగానే ఉందని ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. సినిమాకు కథ, కథనాలు విభిన్నంగా ఉండాలని దర్శకుడు ప్రయత్నించినప్పటికీ, ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. విశ్వక్ సేన్ కూడా గతంలో నటించిన సినిమాలకు భిన్నంగా ఇది ఎంటర్‌టైన్ చేస్తుందనే ఉద్దేశంతో వచ్చినా, ఫలితం అనుకున్నట్టు రాలేదు.
ముఖ్యంగా కథనం చాలా స్లోగా సాగడం, లాజిక్ లేని సీన్లు ప్రేక్షకులకు అసహనాన్ని కలిగించాయి. మ్యూజిక్ పరంగా కూడా లియోన్ జేమ్స్ అందించిన సాంగ్స్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇంతవరకు ఓటీటీలో వచ్చిన కొన్ని సినిమాలు థియేటర్స్ లో పరాజయాన్ని చవిచూసినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మంచి ఆదరణ పొందిన సందర్భాలు ఉన్నాయి. కానీ లైలా విషయంలో అటువంటిది జరగలేదు.
ప్రేక్షకులు పూర్తిగా సినిమాను రిజెక్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక విశ్వక్ సేన్ కెరీర్ పరంగా చూస్తే, ఇది అతనికి ఒక వెకప్ కాల్ లాంటిదే. తన కథల ఎంపికపై మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాను సాహు గరపాటి నిర్మించగా, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీరాజ్, కామాక్షి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ క్యాస్టింగ్ కూడా సినిమా రిసెప్షన్‌ను మెరుగుపరచడంలో విఫలమైంది. ప్రస్తుతం ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు వరుసగా వచ్చిపడుతున్న నేపథ్యంలో, లైలా ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. ఇక విశ్వక్ నెక్స్ట్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.