ఓటీటీలోనూ టాలీవుడ్ దే రాజ్యం!
భవిష్యత్ లో మరిన్ని పాన్ ఇండియా అద్భుతాలు తెలుగు నుంచే జరుగుతాయి? అన్నది అంతే వాస్తవం.;
పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఓ సంచలనం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ చిత్రాలన్నింటిలో గొప్ప విజయాలు అందుకున్న చిత్రాలు ఏవి? అంటే అంతే తెలుగు పరిశ్రమను చూపించాల్సిందే. దేశంలో అన్ని భాషల్లోనూ తెలుగు సినిమా ఆ రేంజ్ లో సత్తా చాటడంతోనే ఈ ఘతన దక్కింది అన్నది కాదనలేని వాస్తవం. `బాహుబలి` నుంచి మొదలైన పరంపర మొన్నటి `పుష్ప2 `వరకూ కొనసాగుతూనే ఉంది.
భవిష్యత్ లో మరిన్ని పాన్ ఇండియా అద్భుతాలు తెలుగు నుంచే జరుగుతాయి? అన్నది అంతే వాస్తవం. అయితే ఓటీటీలో కూడా తెలుగు సినిమాలదే హవా కనిపిస్తోంది. ప్రపచంలో ఎన్ని భాషల్లో చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నా? తెలుగు సినిమాలకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. తెలుగు సినిమాలు ట్రెండింగ్ లో నిలవడం విశేషంగా చెప్పాలి. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన `డాకు మహారాజ్` ఏకంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోనూ సత్తా చాటుతుంది.
బాలయ్య దబిడి దిడికి ఆ రెండు దేశాల అభిమానులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక `లక్కీ భాస్కర్` చిత్రం ఏకంగా 13 వారాల పాటు ఓటీటీలోట్రెండింగ్ లో నిలిచింది. `పుష్ప2` చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఎంతో మంది వీక్షించారు. ఆ సినిమాకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే సంచలనంగా మారింది. అలాగే ఎన్టీఆర్ `దేవర` చిత్రం కూడా ట్రెండింగ్ లో నిలిచింది.
సినిమా థియేట్రికల్ గా డివైడ్ టాక్ వచ్చినా? ఓటీటీ రిలీజ్ లో ఆప్రభావం ఎక్కడా కనిపించలేదు. అన్ని భాషల నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ అందుబాటులో ఉన్నా? సబ్ స్క్రైబర్లు ఎక్కువగా తెలుగు కంటెంట్ చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓటీటీలో కూడా తెలుగు కంటెంట్ దే రాజ్యంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలుస్తాయి? అనడంలో ఎలాంటి సందేహం లేదు.