ఈ వారం ఓటీటీ సినిమాలివే!

ఈ వారం ఏయే సినిమాలు రిలీజ‌య్యాయో, ఏ సినిమాలు ఏ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.;

Update: 2025-02-28 11:08 GMT

ప్ర‌తీ వారం ఓటీటీలోకి చాలానే సినిమాలు వ‌స్తుంటాయి. ఈ వారం కూడా ఎప్ప‌టిలానే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు డిజిట‌ల్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వ‌చ్చేశాయి. ఈ వారం ఏయే సినిమాలు రిలీజ‌య్యాయో, ఏ సినిమాలు ఏ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ లో..

హ‌లో మ‌మ్మీ అనే మ‌లయాళ హార్ర‌ర్ కామెడీతో పాటూ మ‌రాఠీ ఫ్యామిలీ డ్రామా ఫ్యూజ్‌క్లాస్ ద‌బాడే, హాలీవుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా ది లాక్ డౌన్, ఇంగ్లీష్ హిస్టారిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన నికెల్ బాయ్స్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క్రేజీ లిజార్డ్, స్పానిష్ రొమాంటిక్ డ్రామా ది సైలెన్స్ ఆఫ్ మార్కోస్ ట్రెమ్మ‌ర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాల‌తో పాటూ సుఝ‌ల్- ది వ‌ర్టెక్స్ సీజ‌న్2, జిడ్డీ గ‌ర్ల్స్ సీజ‌న్1, ఆశ్ర‌మ్ సీజ‌న్3, హౌస్ ఆఫ్ డేవిడ్ సీజ‌న్1, హేయ్ మెజెస్ట్రీ సీజ‌న్1, ఐ మే ల‌వ్ యు సీజ‌న్1 వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ లోకి వ‌స్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ లో..

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ విడాముయార్చి, హార్ర‌ర్ మిస్టరీ 5 నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్, యానిమేటెడ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా తెర‌కెక్కిన పా పాట్రోల్ః ది మైటీ మూవీ, కామెడీ డ్రామా ది బెస్ట్ క్రిస్ట‌మ‌స్ పాజెంట్ ఎవ‌ర్, యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ డెమాన్ సిటీ, కామెడీ డ్రామా ది రాంగ్ ట్రాక్, రొమాంటిక్ డ్రామా కోపెన్‌హెగెన్ ల‌వ్ స్టోరీ, రొమాంటిక్ కామెడీ సోస్యాల్ క్లైంబ‌ర్స్, సోష‌ల్ డ్రామా బోలెహ్కా సెకాలి సజా కుమెనాంగిస్ రిలీజ‌వుతున్నాయి.

వీటితో పాటూ టాక్సిక్ టౌన్ సీజ‌న్1, డ‌బ్బా కార్టెల్ సీజ‌న్1, ర‌న్నింగ్ పాయింట్ సీజ‌న్1, గ్రేవ్ యార్డ్ సీజ‌న్2, దాలా: డెత్ అండ్ ది ఫ్ల‌వ‌ర్స్ సీజ‌న్1, పునీరు ఈజ్ ఎ క్యూట్ స్మైల్ సీజ‌న్1, మిస్ ఇటాలియ‌న్ మ‌స్ట్ నాట్ డై అనే డాక్యుమెంట‌రీ, ఫుల్ స్వింగ్ సీజ‌న్3, కె ఫుడీ మీట్స్ జె ఫుడీ సీజ‌న్1 స్ట్రీమింగ్ కు వ‌స్తున్నాయి. వీటితో పాటూ ట్రై చో రై, న్యూబీ ఇన్ ది క్ల‌బ్, ల‌వ్ నెవ‌ర్ లైస్ అనే రియాలిటీ షో లు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నాయి.

జీ5లో

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా స్ట్రీమింగ్ కు వ‌స్తుంది.

జియో హాట్‌స్టార్‌లో..

దిల్ దోస్తీ ఔర్ డాగ్స్, ది వాస్ప్, బీట్లేజ్యూస్ బీట్లేజ్యూస్ తో పాటూ ల‌వ్ అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సీజ‌న్1, బ‌జ్ సీజ‌న్1, లా & ఆర్డ‌ర్ టొరొంటో క్రిమిన‌ల్ ఇంటెంట్ సీజ‌న్2, ఫ్యామిలీ గాయ్ సీజ‌న్3, గ్రాస్ పాయింట్ గార్డెన్ సొసైటీ సీజ‌న్1, లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఆలివ‌ర్ సీజ‌న్12, ఇన్‌సైడ‌ర్ విత్ ఫైజు సీజ‌న్1 సిరీస్‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి.

ఆహా ఓటీటీలో..

మ‌ద్రాస్ కార‌ణ్ తో పాటూ ఎమోజీ సీజ‌న్1 రిలీజ్ కానున్నాయి.

ఆహా త‌మిళ్‌లో..

పొలిటిక‌ల్ డ్రామా ప‌రారీ, క్రైమ్ థ్రిల్ల‌ర్ ఆప‌రేష‌న్ రావ‌న్ స్ట్రీమింగ్ కు రానున్నాయి.

స‌న్‌నెక్ట్స్ లో ప్ర‌తినిధి2, పొగుమిద‌మ్ వీగు తూర‌మిల్లై సినిమాలు రిలీజ్ కానుండ‌గా, ఈటీవీ విన్ లో కౌశ‌ల్య సుప్ర‌జ రామ, యాపిల్ టీవీ+లో బెర్లిన్ ఈఆర్ సీజ‌న్1 రిలీజ‌వుతున్నాయి.

Tags:    

Similar News