ఓటీటీలో స్టార్ హీరో సినిమా... 4 వారాల లోపే!
తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా త్రిష హీరోయిన్‌గా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన విదాముయార్చి సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా త్రిష హీరోయిన్‌గా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన విదాముయార్చి సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెలలోనే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన విదాముయార్చి సినిమాకి ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో విడుదల వాయిదా పడింది. సమ్మర్ వరకు సినిమా కోసం వెయిట్ చేయాల్సి రావచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సినిమాను ఈనెల 6న విడుదల చేశారు. సినిమాకు పర్వాలేదు అన్నట్లుగా టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయి. అజిత్ సినిమా అంటే వసూళ్లను ఓ రేంజ్‌లో అభిమానులు ఆశిస్తారు. కానీ ఆ స్తాయిలో నమోదు కాలేదు.
'విదాముయార్చి' సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో విడుదల చేయడం జరిగింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసింది. సాధారణంగా నాలుగు వారాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయింది. దాంతో సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడంకు గాను నిర్మాతల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా డేట్‌ను అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 3న తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
మగిళ్ తిరుమేని ఎంపిక చేసుకున్న కథ బాగానే ఉన్నా అజిత్ కుమార్ స్థాయికి తగ్గట్లుగా సినిమాగా మల్చడంలో విఫలం అయ్యారు. ఎప్పటిలాగే అజిత్ మార్క్ రేసింగ్‌లు, ఫైటింగ్‌లు ఉన్నాయి. కానీ కమర్షియల్ గా మాత్రం నిరాశ పరిచింది. ఈ మధ్య కాలంలో అజిత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం ఉంటే వంద కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. కనుక ఈ సినిమా మీడియంగా ఉన్న మంచి వసూళ్లు సొంతం చేసుకునేది. బాక్సాఫీస్ వద్ద కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా రన్ ముగిసింది. నిర్మాతను మరీ నిరాశ పరచకుండా వసూళ్లను రాబట్టింది.
ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఓటీటీలో రాబోతున్న సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. విదాముయార్చి సినిమా శాటిలైట్ రైట్స్‌ను సన్ టీవీ కొనుగోలు చేసింది. వచ్చే నెలలోనే టీవీలోనూ టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పట్టుదల సినిమాకు సంబంధించి తెలుగు స్ట్రీమింగ్ కోసం అజిత్ తెలుగు అభిమానులు వెయిట్ చేస్తున్నారు.