నెట్ ఫ్లిక్స్.. ఎంపురాన్ విషయంలో ఏం చేస్తుందో?

ఓటీటీ నెట్ ఫ్లిక్స్ రూటే వేరు అని చెప్పాలి. కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.;

Update: 2025-04-03 10:30 GMT
Netflix Unique Approach Censoring L2Empraan Movie

ఓటీటీ నెట్ ఫ్లిక్స్ రూటే వేరు అని చెప్పాలి. కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. రోజురోజుకు భారీ సంఖ్యలో వ్యూయర్స్ ను పెంచుకుంటోంది. అందుకు తగ్గట్లే ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేటట్లు.. అటు సినిమాలను.. ఇటు వెబ్ సిరీస్ లను ఓ రేంజ్ లో స్ట్రీమింగ్ చేస్తూనే ఉంటుంది.

ముఖ్యంగా ఎప్పటికప్పుడు అనేక చిత్రాల డిజిటల్ హక్కులు కొనుగోలు చేసే నెట్ ఫ్లిక్స్.. వాటిని అన్ని లాంగ్వేజెస్ లో అందుబాటులో ఉంచుతుంటుంది. తద్వారా ఓటీటీ లవర్స్ ను బాగా చేరువవుతుంది. అదే సమయంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఓటీటీ వరల్డ్ లో తనదైన శైలిలో నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతుందని చెప్పాలి.

ఏదేమైనా సినిమా హక్కులను కొనుగోలు చేశాక.. వాటిని తమ బృందం ద్వారా మొత్తం చెక్ చేయిస్తుంది. వరల్డ్ వైడ్ గా అందుబాటులో ఉన్న నెట్ ఫ్లిక్స్.. ఎలాంటి కాంట్రవర్సీ డైలాగ్స్ ఉన్నా మ్యూట్ చేస్తుంటుంది. అందుకోసం ఆయా సినిమా మేకర్స్ ను సంప్రదించి.. మ్యూట్ వెర్షన్ ను అడిగి తీసుకుని మరీ స్ట్రీమింగ్ చేస్తుంటుంది.

రీసెంట్ గా భారీ అంచనాల మధ్య వచ్చి సూపర్ హిట్ అయిన తండేల్ మూవీ విషయంలో కూడా అదే చేసింది. అయితే ఇప్పుడు ఇటీవల రిలీజ్ అయిన ఎంపురాన్ విషయంలో ఏం చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఎంపురాన్ ను తెరకెక్కించారు.

సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఆ సినిమా రిలీజ్ అయ్యాక.. కొన్ని సీన్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మూవీ మంచి వసూళ్లు రాబడుతున్నా.. వివాదం మాత్రం నెలకొంది. దీంతో మేకర్స్ సెన్సార్ టీమ్ ను సంప్రదించగా.. 24 కట్స్ చెప్పింది. దీంతో రన్ టైమ్ 2ని.8 సెకన్లు తగ్గింది.

అయితే ఎంపురాన్ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. ట్రిమ్ కాకుండా ఒరిజినల్ వెర్షన్ ను స్ట్రీమ్ చేస్తుందని కొందరు సినీ ప్రియులు అనుకున్నారట. కానీ నెట్ ఫ్లిక్స్.. ట్రిమ్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పలు అనుభవాల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకుందని అర్థమవుతోంది. మొత్తానికి మరోసారి నెట్ ఫ్లిక్స్ ఎలాంటి కాంట్రవర్సీలు జరగకుండా ముందుకెళ్తున్నట్లే.

Tags:    

Similar News