ఓటీటీ వేటకి ఆ బ్లాక్ బస్టర్ రెడీ అవుతోందా?
శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట పటిమ..ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్నా నటన ఆద్యంతం ఆకట్టు కున్నాయి.;
ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ఛావా' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో విక్కీ కౌశల్ కెరీర్ లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్స్ట్ సంస్థ రిలీజ్ చేసింది. ఇక్కడా చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోరాట పటిమ..ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్నా నటన ఆద్యంతం ఆకట్టు కున్నాయి.
విక్కీ కౌశల్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రమిది. శంభాజీ మహారాజ్ ఆహార్యంలో రియల్ శంభాజీనే తలపించాడు. ఇప్పటికీ సినిమా థియేటర్లలో రన్నింగ్ లో ఉంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరమే పైరసీకి గురింది. సినిమా అంతా ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. దీంతో థియేట్రికల్ రిలీజ్ పై కొంత ప్రభావం పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ప్లిక్స్ దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో చిత్రం ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని నాలుగు వారల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా నెట్ ప్లిక్స్ నుంచి అధికారిక రిలీజ్ తేదీ బయటకు రాలేదు గానీ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా సినిమాకి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. అయితే ఎన్ని భాషల్లో అందుబాటులోకి తెస్తారు? అన్నది చూడాలి.
ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ హిందు ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపిం చింది. ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రంగా ప్రమోట్ అయింది. స్కూల్ యాజమాన్యాలు విద్యార్దు లను థియేటర్ కు తరలించి చూపించారు. మరి ఓటీటీలో ఛావా ట్రెండింగ్ లో నిలుస్తాందా? లేదా? అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ ఉట్టేకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు.