మెగా అల్లుడ్ని ఎవరూ మెప్పించలేకపోతున్నారా?
ఏడాదిన్నర కాలంలో చాలా కథలు విన్నాడు. ఏదీ నచ్చలేదంట.;
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా రిలీజ్ అయి ఏడాది దాటింది. 'ఆదికేశవ' తర్వాత ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటించలేదు. 'ఉప్పెన' తర్వాత వరుస ప్రభావలే వైష్ణవ్ ని ఇలా ఇరకాటంలోకి నెట్టాయి. కొడితే హిట్ కంటెంట్ తో నే రావాలనే కసి పట్టుదలతో ఏ కథని ఓపట్టాన అంగీకరించలేదని తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంలో చాలా కథలు విన్నాడు. ఏదీ నచ్చలేదంట.
తనకున్న సోర్సెస్ ద్వారా కొంత మంది వచ్చి కథలు చెబితే....నిర్మాతలు, దర్శకులు, నవతరం నిర్మాత లు నేరుగా ఆయన్ని అప్రోచ్ అయి చెప్పిన వారు మరికొంత మంది. కానీ వాటిలో ఒక్క కథ కూడా వైష్ణవ్ కి నచ్చ లేదు. కొంత మంది కొత్త రచయితల్ని కూడా కలిసి మాట్లాడుట. వాళ్ల దగ్గర ఉన్న కథలు కూడా వినిపించగా పెదవి విరిచేసాడుట. అంటే ఈలెక్కన వైష్ణవ్ తదుపరి సినిమా విషయంలో ఎంత కేర్ పుల్ గా ఉన్నాడు? అన్నది అద్దం పడుతుంది.
ఇది బాగానే ఉంది. కానీ ఈ జాగ్రత్త భారీ గ్యాప్ ని కూడా క్రియేట్ చేస్తుంది. గత మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో మార్కెట్ కూడా డౌన్ ఫాల్ అయింది. తాజాగా ఏర్పడుతోన్న గ్యాప్ తో మార్కెట్ పై మరింత ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కొత్త ఏడాదైనా త్వరగా నిర్ణయం తీసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.
`విరూపాక్ష` తర్వాత సాయి దుర్గ తేజ్ కూడా చాలా సమయం తీసుకుని `సంబరాల ఏటిగట్టు` చిత్రాన్ని ఒకే చేసిన సంగతి తెలిసిందే. `విరూపాక్ష` అతడిని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన చిత్రమైన నేపథ్యంలో సాయితేజ్ ఆచితూచి వ్యవరించాడు.