ఎన్టీఆర్‌ మూవీ వాయిదా... నీల్‌ పబ్లిసిటీ స్టంటా?

ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబోలో మూవీ కోసం దాదాపు ఐదేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.;

Update: 2025-03-26 08:53 GMT
ఎన్టీఆర్‌ మూవీ వాయిదా... నీల్‌ పబ్లిసిటీ స్టంటా?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'దేవర'ను జపాన్‌లో ప్రమోట్‌ చేస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎన్టీఆర్‌ అక్కడ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వేసిన పలు ప్రివ్యూ షో లకు పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కింది. దాంతో దేవర సినిమాను భారీ ఎత్తును జపాన్‌లో విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారనే వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డ్రాగన్‌ సినిమాను ప్రశాంత్‌ నీల్‌ ప్రారంభించాడు. భారీ యాక్షన్‌ సన్నివేశంను ఎన్టీఆర్‌ లేకుండానే షూట్‌ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో డ్రాగన్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. త్వరలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు.

ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబోలో మూవీ కోసం దాదాపు ఐదేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాలతో ప్రశాంత్ నీల్‌ పాన్ ఇండియా స్టార్‌ దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అందుకే ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్‌ సినిమాకు అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా షూటింగ్‌ ప్రారంభించకుండానే ఎన్టీఆర్‌ డ్రాగన్‌ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రశాంత్‌ నీల్‌ అధికారికంగా ప్రకటించాడు. కానీ తాజాగా సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్‌తో భారీ బడ్జెట్‌ సినిమాను తీయాలని అనుకున్నప్పుడు కనీసం ఏడాది మేకింగ్‌కే పడుతుంది. అలాంటప్పుడు ఎలా ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను 2026 జనవరిలో విడుదల చేస్తామని ప్రకటించాడని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది అంతా పబ్లిసిటీ స్టంట్‌ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్ సినిమా నుంచి తీసుకుంటే ప్రతి సారి వాయిదా వేస్తూ వచ్చాడు. కేజీఎఫ్ 2తో పాటు సలార్‌ 1 ను వాయిదాలు వేసిన తర్వాతే విడుదల చేశాడు. సలార్ 2 ను ఎప్పుడు విడుదల చేసేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పటికి సినిమాను విడుదల చేసేది ప్రశాంత్ నీల్‌ నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

సలార్‌ 2 గురించి ఎలాంటి అప్డేట్‌ లేకుండానే ఎన్టీఆర్‌ డ్రాగన్‌ను సంక్రాంతికి అంటూ ప్రశాంత్ నీల్‌ నుంచి వచ్చిన ప్రకటనను చాలా మంది విశ్వసించలేదు. ఎన్టీఆర్‌ అభిమానులు ఆశలు పెట్టుకున్నా ఎక్కువ శాతం మంది ఆ తేదీకి ఎన్టీఆర్‌ సినిమా రావడం అంటే కచ్చితంగా అద్భుతం అనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమాను జనవరి బరి నుంచి తప్పించడానికి విజయ్‌ జన నాయగన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ షూటింగ్‌ లో జాయిన్‌ కాలేదు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, పాటలు, కీలక టాకీ పార్ట్‌ షూటింగ్‌ చేయాల్సి ఉంది. ఇంత షూటింగ్ ఉండగా జనవరిలో సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని ప్రశాంత్‌ నీల్‌కి తెలుసు. అయినా ఆయన పబ్లిసిటీ కోసమే ఇలా సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తాడు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ ప్రశాంత్‌ నీల్‌కే తెలియాలి. ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది చూడాలి.

Tags:    

Similar News