ది ప్యారడైజ్ స్టన్నింగ్ లుక్.. వైల్డ్ నాని వెనక్కి తగ్గేలా లేడు

నేచురల్ స్టార్ నాని, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ది ప్యారడైజ్.;

Update: 2025-03-26 09:40 GMT
Nanis manly look from The Paradise

నేచురల్ స్టార్ నాని, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ది ప్యారడైజ్. మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ షేడ్స్‌తో మిక్స్ చేసిన మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుండటంతో, ప్రతి చిన్న అప్డేట్ మీదా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక ఉత్కంఠ నెలకొంటోంది.

Nanis manly look from The Paradise


లేటెస్ట్ గా విడుదలైన నాని లుక్ పోస్టర్ ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. మిషిన్ గన్ తో, వీరుడిలా ముక్తంగా వర్షాన్ని తట్టుకుని నిలబడి ఉన్న నాని లుక్ సినిమాపై ఊహించని ఇంటెన్సిటీని పెంచింది. ఈ విజువల్స్‌కి వెండితెరపై హై వోల్టేజ్ వైబ్ ఇవ్వడం గ్యారెంటీ. 1980ల కాలాన్ని బేస్‌గా తీసుకుని మ్యాడ్ మ్యాక్స్ శైలిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి విజువల్ మాసివ్ ఎక్స్‌పీరియన్స్ అనే ట్యాగ్ ఇప్పటికీ చక్కగా సెట్ అయ్యింది.

ఈ సినిమాను ప్రొడక్షన్ పరంగా ఎంతో గ్రాండ్‌గా డిజైన్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇద్దరూ సినిమా విజువల్ రిచ్‌గా ఉండేలా ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. బజ్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ సుమారు 110-120 కోట్లు వరకు ఉండే అవకాశం ఉంది. అన్ని భాషల్లో విడుదలవుతుండటంతో బిజినెస్ పరంగా కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. నాని ఇంతవరకు చేసిన సినిమాల్లో ఇదే అతిపెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ అవుతుందని టాక్.

అయితే ఇటీవల ఓ గాసిప్ హల్‌చల్ చేసింది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌గా ప్రకటించిన 2026 మార్చి 26న మరో బడా ప్రాజెక్ట్.. రామ్ చరణ్-బుచిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కూడా విడుదల కావచ్చని ప్రచారం జరిగింది. అంతే కాదు, అదే వారానికి ముందు రణ్‌బీర్ కపూర్ లవ్ అండ్ వార్, యశ్ ‘టాక్సిక్’ సినిమా కూడా రిలీజ్ కావడం వల్ల నాని తమ రిలీజ్ డేట్‌ను మార్చవచ్చునని చర్చ మొదలైంది.

ఈ పోటీలో నిలబడటం కష్టమైపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మేకర్స్ ఆ గాసిప్స్‌కు నేటితో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంకా 365 రోజులు అంటూ నాని కొత్త పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను మరోసారి గుర్తు చేస్తూ అఫీషియల్‌గా 26.3.26 అని ప్రకటించారు. అంటే, ప్యారడైజ్ పోటీలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టమైంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత నాని లుక్‌కి మెచ్చిపోయిన నెటిజన్లు నాని ఈసారి వైల్డ్ బాడితో షాక్ ఇచ్చేలా ఉన్నాడు.. యాక్షన్‌తో మాస్ మసాలా ప్యారడైజ్ బాంబ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తంగా చెప్పాలంటే, ప్యారడైజ్ నాని కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ స్టెప్ అవుతుందని ఈ పోస్టర్ మరోసారి స్పష్టం చేసింది. రిలీజ్ డేట్‌పై గాసిప్స్ వచ్చినా, మేకర్స్ క్లారిటీ ఇచ్చారంటే సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం అవుతుంది. మరి, ఈ యాక్షన్ ఫెస్టివల్ ఎలా ఉంటుందో వచ్చే అప్డేట్స్ ను బట్టి అర్ధమవుతుంది.

Tags:    

Similar News