L2E: సినిమా టోటల్ బడ్జెట్ ఎంతంటే..
2019లో వచ్చిన లూసిఫర్‌కి ఇది సీక్వెల్, తొలి భాగం అన్ని భాషల్లోనూ ఓ డీసెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై అటెన్షన్ పెరగడానికి ప్రధాన కారణం;

పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు చర్చకు కేంద్రబిందువవుతున్న సినిమా ఎంపురాన్ (L2: Empuraan). మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 2019లో వచ్చిన లూసిఫర్‌కి ఇది సీక్వెల్, తొలి భాగం అన్ని భాషల్లోనూ ఓ డీసెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై అటెన్షన్ పెరగడానికి ప్రధాన కారణం. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు బజ్‌ను రెట్టింపు చేస్తున్నాయి.
మలయాళ చిత్రసీమ అంటే సాధారణంగా తక్కువ బడ్జెట్‌లో మెచ్చుకునే కంటెంట్‌ను ఇవ్వగల ఇండస్ట్రీగా పేరు ఉంది. కానీ ఈసారి మాత్రం మలయాళం నుంచి వచ్చిన ఈ ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా మాస్, స్టైల్, స్కేల్ అన్నింటినీ మిక్స్ చేసిన భారీ విజువల్ ఫెస్టుగా మలచినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండేళ్లుగా జరుగుతుండటమే కాక, విదేశాల్లోని అనేక లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే టెక్నికల్ టీమ్ విషయంలోనూ అత్యుత్తమ టాలెంట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఇది నిజంగా షాక్ చేసే విషయమే. పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మోహన్‌లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదట. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ, విజన్ పట్ల ఉన్న నమ్మకంతో సినిమా పట్ల వారు సక్రిఫైస్ చేయడం ఎంతో ప్రోత్సాహకరంగా మారింది. ఈ కారణంగా ప్రొడక్షన్ ఖర్చు మాత్రమే సుమారు 75 కోట్ల నుండి 80 కోట్ల మధ్య ముగిసిందని మలయాళ వర్గాల సమాచారం. అయితే సినిమా రిలీజ్ తర్వాత షేర్ ఆధారంగా రేవెన్యూ పర్వీషన్ ఉన్నట్లు వినిపిస్తోంది. మొత్తంగా రివెన్యూ షేర్ మరియు ఇతర ఖర్చులు కలుపుకుంటే ఈ సినిమా మొత్తంగా 130-150 కోట్లు బడ్జెట్‌తో రూపొందినట్లు విశ్లేషకుల అంచనా.
ఇప్పటికే సినిమా బుక్ మై షో ప్రీ సేల్స్‌లో 50 కోట్లకు చేరుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఒక మలయాళ సినిమా ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం నిజంగా అరుదైన విషయం. 'బాహుబలి', 'పుష్ప', 'కల్కి' వంటి భారీ సినిమాలకు మాత్రమే సాధ్యమైన రేంజ్ ఇది. ఇప్పుడు ఎంపురాన్ ఆ జాబితాలో చేరుతోంది. దేశవ్యాప్తంగా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ఉండటంతో మొదటి రోజే వందలాది థియేటర్లలో స్క్రీనింగ్ జరగనుంది. దీంతో ఫస్ట్ డే నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద రెవెన్యూ వెల్లువ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాలో మోహన్‌లాల్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. రాజకీయం, మాఫియా, ఇంటెలిజెన్స్ అంశాల మేళవింపుతో కథ నడవనుందని సమాచారం. ఈసారి కథలోని ఇంటెన్సిటీ మరింత పెరిగేలా పృథ్వీరాజ్ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారని అంటున్నారు. బిజినెస్ పరంగా, బడ్జెట్ పరంగా మలయాళ సినిమా స్థాయిని పెంచిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. మరి ఎన్నో అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా, బడ్జెట్‌ను మించిన బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందా లేదా అన్నది చూడాలి.