చైతూ కొత్త ఫుడ్ వెంచర్.. పిక్స్ చూశారా?
టాలీవుడ్ యంగ్ నాగచైతన్య.. సినిమాలు కాకుండా ఫుడ్ బిజినెస్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;

టాలీవుడ్ యంగ్ నాగచైతన్య.. సినిమాలు కాకుండా ఫుడ్ బిజినెస్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ స్టార్ట్ చేయగా.. సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లో చైతూ ఇంకో అడుగు ముందుకేశారు. స్కుజి పేరుతో కొత్త ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు.

అందుకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు. రెస్టారెంట్ కిచెన్ తోపాటు అక్కడ రెడీ అవుతున్న ఫుడ్ ఐటమ్స్ పిక్స్ ను షేర్ చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు. వరల్డ్ వైడ్ గా ఉన్న అద్భుతమైన తినుబండారాల నుండి ఆహారాన్ని, రుచులను శాంపిల్ గా పరిచయం చేయడానికి ఇన్నాళ్లకు సమయం కుదిరిందని తెలిపారు.
"ఇప్పటికే ఉత్సాహంతో షోయూని స్టార్ట్ చేశాను. దాని ద్వారా మాకు లభించిన ప్రేమ, అద్భుతమైన కొత్త భాగస్వాములతో మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు నన్ను ప్రేరేపించిందని అనౌన్స్ చేస్తున్నారు. మేం సంప్రదాయ వంటకాలను తయారు చేస్తాం. మా మెనూతో ఉల్లాసభరితమైన మార్గాలను కనుగొంటామని హామీ ఇస్తున్నాం" అంటూ రాసుకొచ్చారు చైతూ.
స్కుజి రెస్టారెంట్ ను అంతా ఆనందిస్తారని, ఆస్వాదిస్తారని ప్రతి విషయంలో తమ ప్రేమను గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు నాగ చైతన్య తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన పోస్ట్ వైరల్ గా మారింది. అటు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంతా బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు పోస్టులు పెడుతున్నారు.
ఇక చైతూ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తండేల్ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఆ మూవీ బిగ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో చైతూ ఇప్పుడు సక్సెస్ జోష్ లో ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు.
అయితే తండేల్ మూవీ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో వర్క్ చేస్తున్నారు చైతూ. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఆ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా అందిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.