త్రివిక్రమ్ - బన్నీ మైథలాజికల్ గేమ్.. క్యారెక్టర్ ఇదేనా?

ఇటీవల నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం మైథలాజికల్ జానర్‌లో ఉంటుందని స్పష్టం చేశారు.;

Update: 2025-04-01 13:21 GMT
త్రివిక్రమ్ - బన్నీ మైథలాజికల్ గేమ్.. క్యారెక్టర్ ఇదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా పుష్ప 2 విజయంతో తన మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్లింది. దీంతో బన్నీ తర్వాతి సినిమా ఏదైనా, అది భారీ అంచనాలు రాబట్టేలా ఉండాల్సిందే. ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ పై అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అట్లీ తో లైన్ లో ఉండగా.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇటీవల నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం మైథలాజికల్ జానర్‌లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇది సోషియో ఫాంటసీ కాకుండా పూర్తిగా పురాణాల ఆధారంగా రూపొందనున్న మల్టీ లెవెల్ స్క్రీన్‌ప్లేతో ఉండబోతోందని వెల్లడించారు. దీని ద్వారా త్రివిక్రమ్ తనకు చెందిన డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలతో కొత్త రీతిలో ప్రదర్శించబోతున్నాడట. షూటింగ్ ఇదే ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానుందని కూడా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఫుల్ జోష్ కనిపిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం, బన్నీ ఈ సినిమాలో కుమారస్వామి పాత్రను పోషించనున్నాడనే ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్ ఆర్ట్స్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మేకర్స్ అధికారికంగా పాత్రలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ, బన్నీ మోడ్రన్ మాస్ పాత్రల నుంచి ఈసారి డివైన్ యాంగిల్ లా మారడం టాలీవుడ్‌లోనే పెద్ద మార్పుగా నిలవబోతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంతవరకు చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు మాస్, క్లాస్‌కు బ్రిడ్జ్ వేశాయి. ఇప్పుడు మైథాలజీతో మరింత విస్తృతంగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాదికి విడుదల చేయాలనే ప్లాన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి ట్రెండ్‌ను చూస్తే, భగవత్ గీత ఆధారంగా పౌరాణిక కథలు, విజువల్ గ్రాండియర్ కలిగి ఉన్న చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. బ్రహ్మాస్త్రా, కాంతారా, ఆదిపురుష్ లాంటి చిత్రాల ట్రెండ్ చూసి, త్రివిక్రమ్ కూడా తన శైలిలో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ సినిమా అనగానే ఆ ఫ్యాన్ బేస్ రెస్పాన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. గత సినిమాలకు భిన్నంగా ఈసారి పౌరాణిక అంశాలతో సీరియస్ కథనాన్ని త్రివిక్రమ్ రాసినట్టు టాక్. ఇది నరేషన్ పరంగా, విజువల్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ల స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. సౌండ్ డిజైన్, డైలాగ్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ కు కీలకం కానున్నాయి.

Tags:    

Similar News