మెగాస్టార్ కోసం మరో హై వోల్టేజ్ కాంబినేషన్?
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడిని ఇంకా ఖరారు చేయలేదు. అయితే అగ్రశ్రేణి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం.;

మెగాస్టార్ చిరంజీవి లైనప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. వరుసగా యువ దర్శకులతో కొత్త తరహా కథలపై ఫోకస్ పెడుతూ, తన సత్తాను మరోసారి నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ అప్‌డేట్ బయటకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవీఎన్ ప్రొడక్షన్స్‌తో చిరంజీవి కలిసి భారీ స్థాయిలో సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందట.
కెవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే కన్నడలో ఇప్పటికే యశ్ తో టాక్సిక్ అనే సినిమాను నిర్మిస్తోంది. అలాగే పలు తెలుగు బిగ్ సినిమాలను కన్నడలో రిలీజ్ చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు తొలిసారి తెలుగులో మెగాస్టార్‌తో చేతులు కలపడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ప్లానింగ్ ఇప్పటికే మొదలైందని సమాచారం. అలాగే చిరంజీవి నటిస్తున్న 'చిరు ఓదెల' ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడిని ఇంకా ఖరారు చేయలేదు. అయితే అగ్రశ్రేణి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. కథ సిద్ధంగా ఉన్నప్పటికీ, చిరు ఇమేజ్‌కు తగిన విధంగా, కొత్తగా, వినోదాత్మకంగా ఉండేలా డైరెక్టర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒక యువ దర్శకుడికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే అనిల్ రావిపూడితో, శ్రీకాంత్ ఓదెలతో కూడా ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో కెవీఎన్ ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ తన సినిమాల షెడ్యూల్‌లో కీలకంగా మారనుంది. భారీ బడ్జెట్, అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందనున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
త్వరలోనే కథ, దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు ఒక అప్డేట్ ద్వారా వెల్లడించే అవకాశం ఉందట. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మరో బిగ్ ప్రాజెక్టు గా నిలుస్తుందని సమాచారం. అలాగే మెగాస్టార్ కోసం మరికొందరు దర్శకులు కూడా లైన్ లో ఉన్నారు. అందులో బాబీ ఒకరు. ఇదివరకే బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన మెగాస్టార్ మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.