డేవిడ్ వార్నర్‌..ఈసారి సీక్వెల్‌లో చించేద్దాం!

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రాబిన్‌హుడ్‌' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

Update: 2025-03-29 08:20 GMT
David Warner, who made a brief yet impactful appearance in Robin Hood

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రాబిన్‌హుడ్‌' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది, రంజాన్ పండుగలు ఉన్న కారణంగా లాంగ్‌ వీకెండ్‌ రాబిన్‌హుడ్‌ సినిమాకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాకు వచ్చిన స్పందన గురించి పక్కన పెడితే ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌ పాత్ర గురించి చర్చ జరుగుతోంది. ఆయన అభిమానులు రాబిన్‌హుడ్‌లో ఆయన పాత్ర గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ సమయంలో డేవిడ్‌ వార్నర్ పాత్ర గురించి ప్రముఖంగా మాట్లాడారు. తీరా చూస్తే సినిమాలో వార్నర్‌ పాత్ర నిండా మూడు నిమిషాలు కూడా లేదు. దాంతో ఆయన అభిమానులు యూనిట్‌ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

క్లైమాక్స్‌లో స్టైలిష్‌ లుక్‌లో, స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన డేవిడ్‌ వార్నర్‌ పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటే సినిమా ఫలితం ఖచ్చితంగా వేరే ఉండేది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని దర్శకుడు వెంకీ కుడుముల పదే పదే చెప్పాడు. ట్రైలర్‌లోనూ వార్నర్‌ షాట్స్ వేయడంతో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంలో వెంకీ కుడుముల విఫలం అయ్యాడు. ఆయన మాట్లాడిన మాటలు, ప్రమోషన్‌లో చేసిన హడావుడితో కనీసం పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు వార్నర్‌ స్క్రీన్‌పై కనిపిస్తాడని అంతా ఊహించారు. కానీ మూడు నిమిషాలు కూడా లేకపోవడంతో అవాక్కవుతున్నారు.

రాబిన్‌హుడ్‌ సినిమా ముగించే సమయంలో సీక్వెల్‌ గురించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉందని ప్రకటించడం ద్వారా ఒకింత వార్నర్‌ పాత్రపై ఆసక్తి పెంచారు. మొదటి పార్ట్‌లో వార్నర్ పాత్రను ఆశించిన స్థాయిలో చూపించలేక పోయిన దర్శకుడు వెంకీ కుడుముల కనీసం రెండో పార్ట్‌లో అయినా వార్నర్‌ పాత్రను ఎక్కువ సమయం చూపించాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా మొదటి పార్ట్‌లో నితిన్‌ - వార్నర్‌ల కాంబోలో సన్నివేశాలు లేకపోవడం ఫ్యాన్స్‌కి నిరాశ మిగిల్చింది. కానీ సెకండ్‌ పార్ట్‌లో కచ్చితంగా నితిన్‌, వార్నర్‌ కాంబోలో యాక్షన్‌ సన్నివేశాలతో పాటు టాకీ పార్ట్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి.

బ్రదర్‌ హుడ్‌ ఆఫ్‌ రాబిన్‌హుడ్‌ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్‌లో డేవిడ్ వార్నర్‌ పాత్ర ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్‌లో నితిన్‌ పాత్రను సైతం పవర్‌ ఫుల్‌గా చూపించలేదు అనే విమర్శలు వచ్చాయి. పార్ట్‌ 2 లో కథను మరింత పవర్‌ ఫుల్‌గా చూపించే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో కనిపించిన విలన్‌ సెకండ్‌ పార్ట్‌లో కనిపించక పోవచ్చని, మెయిన్ విలన్‌గా వార్నర్‌ కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి మొదటి పార్ట్‌లో వార్నర్‌ను పెద్దగా చూపించలేక పోయాం కానీ సెకండ్‌ పార్ట్‌లో మాత్రం అతడి పాత్రతో చించేద్దాం అన్నట్లుగా మేకర్స్‌ తీరు ఉందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రాబిన్‌హుడ్‌ సీక్వెల్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News