సూపర్ హిట్ సిరీస్ 3వ సీజన్.. రెండు కీలక అప్‌డేట్స్
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండు సీజన్‌లు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండు సీజన్‌లు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సీజన్ 2 లో సమంత నటించడం ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌ని ప్రేక్షకులు తెగ చూసిన విషయం తెల్సిందే. సీజన్ 2 వచ్చిన తర్వాత చాలా మంది సీజన్ 1ను చూశారని సమాచారం. సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌లకు వరుస సీజన్‌లు రూపొందుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ను మొదలు పెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ సీజన్ 3 యొక్క షూటింగ్ ప్రారంభం అయింది. ఎట్టకేలకు సీజన్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుందట.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అనగానే మనోజ్ బాజ్‌పాయ్ గుర్తుకు వస్తాడు. రెండు సీజన్‌లలోనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్‌కి పర్‌ఫెక్ట్ మీనింగ్ ఇతడు అనిపించేలా నటిస్తూ ఉంటాడు. రెండు సీజన్‌లలోనూ ఆయన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. మూడో సీజన్‌ను వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విభిన్నమైన కథను రెడీ చేసుకుని దాదాపు రెండేళ్లుగా మేకింగ్ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 స్ట్రీమింగ్ విషయంతో పాటు సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన నటుడి విషయమై కీలక అప్డేట్స్‌ను మనోజ్ బాజ్‌పాయ్ ఇచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పై కీలక అప్డేట్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం జైదీప్ రెండేళ్ల క్రితమే షూటింగ్‌కి జాయిన్ అయ్యాడు. సిరీస్‌లో జైదీప్ కీలకమైన గెస్ట్ రోల్ అని అంతా అనుకుంటున్నారు. కానీ తాజాగా మనోజ్ బాజ్‌పాయ్ చెప్పిన విషయాన్ని బట్టి కచ్చితంగా సీజన్ 3 లో జైదీప్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జైదీప్ ఈ వెబ్ సిరీస్‌లో కనిపిస్తే కచ్చితంగా మొదటి రెండు సీజన్‌లతో పోల్చితే మూడో సీజన్ అదిరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెబ్ సిరీస్‌ను ఈ ఏడాది నవంబర్ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మనోజ్ బాజ్‌పాయ్ ప్రకటించాడు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి మొదటి సారి స్ట్రీమింగ్ అప్డేట్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న నటుడి గురించి క్లారిటీ వచ్చింది. సిరీస్ స్ట్రీమింగ్‌కు ఇంకా సమయం ఉంది. కనుక ఈ లోపు సాధ్యం అయినంత వరకు బెస్ట్ ఔట్ పుట్‌ను తీసుకు వచ్చేందుకు రాజ్ అండ్ డీకే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. సీజన్ 2 లో నటించిన సమంత సీజన్ 3 లోనూ ఉంటే బాగుంటుంది అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్‌కి గత రెండు సీజన్‌ల కంటే బాగుంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ ఏడాది నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.