హిట్ 3: నాని గురి పెట్టాడంటే..

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ ఇప్పుడు బాక్సాఫీస్ టార్గెట్‌గా మారింది.;

Update: 2025-04-01 09:16 GMT
Nani HIT3 Movie Count Down Poster

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ ఇప్పుడు బాక్సాఫీస్ టార్గెట్‌గా మారింది. మే 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచారు. తాజాగా 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో నాని చేతిలో గన్ పట్టుకుని, నోరులో సిగార్‌తో పూర్తిగా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఒకే ఫ్రేమ్‌లో నాని పవర్ఫుల్ లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్‌ను స్పష్టంగా చూపించింది.

Nani HIT3 Movie Count Down Poster release

‘హిట్’ ఫ్రాంచైజీలో ఇదే మూడో కేస్. గతంలో విశ్వక్ సేన్, అడివి శేష్‌లు చేసిన ఈ సిరీస్‌లో ఇప్పుడు నాని మెయిన్ లీడ్‌గా వచ్చారు. ఈ సినిమాకోసం నాని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్‌కు లోనయ్యాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలోనే కాదు.. క్యారెక్టర్ టోన్‌లోనూ మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ టఫ్ స్టైల్‌ని తెచ్చారు. ఇటీవల వచ్చిన టీజర్ ఈ సంగతి చెప్పేసింది. కానీ అదే సమయంలో సినిమా మొదటి పాట మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రేమ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ సింగిల్ ప్యూర్ మెలోడీగా ఆకట్టుకుంది. శ్రీనిధి శెట్టి – నాని మధ్య కెమిస్ట్రీ ఫ్రెష్‌గా అనిపించడంతో పాటు, హిట్ ఫ్రాంచైజీలో ఈసారి ప్రేమ కోణాన్ని కూడా టచ్ చేశారని తెలియజేసింది. ఈ సాంగ్‌లో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించడం, ప్రేమికుడిగా నటించడం సినిమా మల్టీ లేయర్డ్ నేరేషన్‌కి హింట్ ఇచ్చింది. దర్శకుడు శైలేష్ కొలను ఈసారి కథను మరింత పెద్ద లెవెల్‌లో ప్రెజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

నాని ఇందులో వైలెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇతని క్యారెక్టర్‌లోని బిగ్ ఛాలెంజ్ లతో ఉండే ఒత్తిడిని వేరే కోణంలో చూపించబోతున్నారని సమాచారం. ఇందుకోసం నాని తన నటనలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చాడు. ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. మే 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రతి వారం ఓ కొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ టిమ్ విషయాల్లోనూ ఇది మరో లెవెల్‌లో ఉండబోతోంది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మే 1న విడుదలయ్యే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఓ వైపు యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. మరోవైపు ఎమోషన్ మెలొడీ మిక్స్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘హిట్ 3’ కౌంట్‌డౌన్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోయింది. నాని గురి పెట్టాడంటే బ్లాస్ట్ అవ్వాల్సిందే అనేలా కామెంట్స్ అందుతున్నాయి.

Tags:    

Similar News