ఇది కదా అసలు సిసలైన ఫైట్..!
ఈ ఇయర్ ఆగష్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్నాయి రజినీకాంత్ కూలీ, ఇంకా హృతిక్ ఎన్ టీ ఆర్ నటిస్తున్న వార్ 2.;

సినిమాల రిలీజ్ కు ప్రతిసారి ఒక సీజన్ అనేది ఉంటుంది. సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్ మస్ ఇలా ఫెస్టివల్ టార్గెట్ గా స్టార్ సినిమాలు రిలీజ్ ఉంటాయి. వాటితో పాటే సమ్మర్, పోస్ట్ సమ్మర్ లో కూడా కొన్ని సినిమాలు టార్గెట్ పెట్టుకున్నాయి. ఐతే ప్రతి ఏడాది ఇండిపెండెన్స్ డే కి కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫైట్ బాక్సాఫీస్ దగ్గర ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల మధ్య ఈ పోటీ ఉంటుంది. ఈసారి ఇండిపెండెన్స్ డే కి రెండు భారీ సినిమాలు తలపడుతున్నాయి.
మొన్నటిదాక రిలీజ్ డేట్ లు కన్ఫర్మ్ చేయని ఈ సినిమాలు ఫైనల్ గా రణరంగానికి సిద్ధం అనేస్తున్నాయి. ఈ ఇయర్ ఆగష్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్నాయి రజినీకాంత్ కూలీ, ఇంకా హృతిక్ ఎన్ టీ ఆర్ నటిస్తున్న వార్ 2. ఈ రెండు సినిమాలు తెలుగు వెర్షన్ డబ్బింగ్ కే ప్రిఫరెన్స్ ఇస్తాయి. అయినా కూడా ఈ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా గట్టి పోటీ పడనున్నాయి.
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న కూలీ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. అంతేకాదు సినిమాలో మన కింగ్ నాగార్జునతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర భాగం అవడం మరింత స్పెషల్ గా మారింది. లోకేష్ సినిమాలకు పాన్ ఇండియా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో రజినీ కూలీకి బజ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.
ఇక మరోపక్క హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న వార్ 2 సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా ఆగష్టు 14న పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. హృతిక్ తో తారక్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ ప్రాజెక్ట్ కు ప్రత్యేకత తెచ్చింది. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకు తెలుగులో సూపర్ డిమాండ్ ఉంటుంది.
సో రజినీ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 రెండు సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. ఈ సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుంది.. ఏ సినిమా విజయ ఢంకా మోగిస్తుంది అన్నది చూడాలి.