ఏజ్ గ్యాప్ మ్యాటరే కాదంటున్న హీరోయిన్
ఈ విషయంలో అందరూ సల్మాన్ ను తప్పుబట్టగా తాజాగా ఈ విషయంపై హీరోయిన్ అమీషా పటేల్ స్పందించారు.;

సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ విషయంలో ఎవరొకరు వివాదంలో ఉంటూనే ఉంటారు. దీనిపై డిస్కషన్స్ కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదొక జంట ఈ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఈ విషయంలో హీరోయిన్ల కంటే హీరోలనే ఎక్కువ విమర్శిస్తుంటారు. టాలీవుడ్ లో ఆల్రెడీ చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ ఈ వివాదాలను ఎదుర్కొన్నారు.
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ ఎప్పట్నుంచో ఉంది. తమకంటే చాలా చిన్న వాళ్లైన హీరోయిన్లతో హీరోలు నటించడాన్ని ఆడియన్స్ విమర్శిస్తున్నారు. రీసెంట్ గా ఈ వివాదం సల్మాన్ ఖాన్ ఎదుర్కొన్నారు. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా వచ్చిన సికిందర్ సినిమాలో అతనికంటే 31 ఏళ్లు చిన్నదైన రష్మికతో కలిసి నటించడంతో ఆయన్ని అందరూ తప్పు పట్టారు.
ఈ విషయంలో అందరూ సల్మాన్ ను తప్పుబట్టగా తాజాగా ఈ విషయంపై హీరోయిన్ అమీషా పటేల్ స్పందించారు. మూవీస్ లో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ చాలా కామన్ అని ఆమె అన్నారు. తాను కూడా గతంలో తనకంటే వయసులో ఎంతో పెద్ద హీరోలతో కలిసి వర్క్ చేశానని, గదర్2 లో తనకంటే 20 ఏళ్లు పెద్దైన సన్నీ డియోల్ తో కలిసి నటించానని, ఆ సినిమా అందరికీ బాగా నచ్చడంతో పాటూ ఆ మూవీలో తమ కెమిస్ట్రీకి ఆడియన్స్ మంచి మార్కులేశారని తెలిపింది.
గదర్2 లో తమ జంట లానే సికిందర్ లో రష్మిక, సల్మాన్ జంట కూడా బాగా వర్కవుట్ అయిందని, తాను సికిందర్ సినిమా చూశానని, ఆ సినిమా తనకెంతో నచ్చిందని, ఏ కారణం లేకుండా సినిమాలు ఆడవని, సికిందర్ లో కంటెంట్ ఉంది కాబట్టే ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తున్నారని ఆమె అన్నారు. రానున్న రోజుల్లో సికిందర్ ఇంకా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అమీషా పటేల్ అభిప్రాయ పడ్డారు .
సికిందర్ రిలీజ్ కు ముందు ఈ విషయంలో ఎక్కువగా విమర్శలు రావడంతో సికిందర్ ట్రైలర్ లాంచ్ లో సల్మాన్ ఈ విషయం గురించి ప్రస్తావించి మండిపడిన విషయం తెలిసిందే. అందరూ ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడుతున్నారని, రష్మికకు తన తండ్రికి లేని బాధ మీకెందుకని అడిగిన సల్మాన్, పెళ్లి తర్వాత రష్మికకు అమ్మాయి పుట్టి తాను స్టార్ అయితే ఆమెతో కూడా కలిసి నటిస్తానని, రష్మిక కూడా దానికి అభ్యంతరం తెలపదని సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిఒందే.