ధనుష్ మూవీ వాయిదాకు రీజనేంటి?
ఇడ్లీకడై సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కానుందని తెలియచేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ను అనౌన్స్ చేశారు.;

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు సినీ నిర్మాతగా, పాటలు రాస్తూ తనలోని టాలెంట్ ను బయటపెట్టి అందరినీ అలరిస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా లైఫ్ ను గడుపుతున్న ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇడ్లీ కడై.
ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని, అందులో భాగంగానే ఏప్రిల్ 10న రిలీజ్ చేద్దామని మేకర్స్ ఫిక్స్ అయి అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇడ్లీ కడై వాయిదా పడుతున్నట్టు మధ్యలో వార్తలొచ్చినప్పటికీ మేకర్స్ మాత్రం సినిమా ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కే వస్తుందన్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవని నేపథ్యంలో ఇడ్లీకడైను వాయిదా వేస్తున్నారు. ఇడ్లీ కడైకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ విదేశాల్లో చేయాల్సి ఉండగా దాని కోసమే సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 6 నెలలు వాయిదా పడి అక్టోబర్ కు షిప్ట్ అయింది.
ఇడ్లీకడై సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కానుందని తెలియచేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ను అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్య మీనన్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో తిరు సినిమా వచ్చి నేషనల్ లెవెల్ లో సత్తా చాటింది. తిరు మూవీలో నటనకు గానూ నిత్యకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
తిరు తర్వాత వారిద్దరి కలయికలో వస్తున్న మూవీ కావడంతో ఇడ్లీ కడై కూడా ఆ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్, రెడ్ జెయింట్, వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆకాష్ భాస్కరన్, ధనుష్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమ్మర్ లో వస్తుందని ఇప్పటివరకు ఊరించి ఇప్పుడు ఆ సినిమాను 6 నెలలు వాయిదా వేయడంపై ధనుష్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.